తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​@3PM - తెలంగాణ తాజా అప్​డేట్స్​

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TELANGANA NEWS
TELANGANA NEWS

By

Published : Mar 24, 2021, 2:58 PM IST

ఇంటర్ కాలేజీలు బంద్

కరోనా దృష్ట్యా ఇంటర్ కళాశాలలు మూసివేయాలని ఇంటర్​ బోర్టు కార్యదర్శి జలీల్ ఆదేశించారు. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఈ ఆదేశాలు వర్తిస్తాయన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

థియేటర్ల మూసివేతపై స్పష్టత

కొవిడ్​ వ్యాప్తి కారణంగా నేటి నుంచి విద్యాసంస్థలు మూసివేసిన ప్రభుత్వం.. సినిమా థియేటర్లనూ బంద్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన మంత్రి తలసాని.. ఆ వార్తల్లో వాస్తవం లేదన్నారు. వదంతులు నమ్మవద్దని.. థియేటర్లు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అదరహో అనిపించిన మోడల్స్

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్ డెక్కన్‌ హోటల్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మోడల్స్​ మెరిశారు. ఏప్రిల్ 8 నుంచి మూడు రోజుల పాటు ఆర్కాయం పేరుతో నిర్వహించనున్న ఫ్యాషన్ ఎగ్జిబిషన్ బ్రోచర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో క్యాట్​వాక్​లతో అదరహో అనిపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'అప్పుడే జీఎస్​టీ పరిధిలోకి పెట్రోల్!'

వచ్చే 8-10 ఏళ్ల వరకు పెట్రోల్, డీజిల్​ను జీఎస్​టీ పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం లేదని భాజపా ఎంపీ సుశీల్ కుమార్ మోదీ పేర్కొన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై జీఎస్​టీ విధిస్తే.. రూ. 2 లక్షల కోట్లకుపైగా నష్టం వాటిల్లుతుందని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కేరళలో అమిత్​షా..

బంగారం అక్రమ రవాణాతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​కు, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎం.శివశంకర్​కు సంబంధం ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా త్రిపునితురాలో రోడ్​షో నిర్వహించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'అభివృద్ధి పేరుతో మోసం'

ఐరాసలో శ్రీలంక వ్యతిరేక తీర్మానంపై జరిగిన ఓటింగ్​లో భారత్​ దూరంగా ఉండటాన్ని తప్పుపట్టారు కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం. అభివృద్ధి పేరుతో తమిళ ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

స్మార్ట్​వాచ్​లు.. ఫీచర్లు

దేశీయ మార్కెట్లోకి ఓకేసారి మూడు స్మార్ట్​ఫోన్లను, తొలి స్మార్ట్​వాచ్​ను విడుదల చేసింది వన్​ప్లస్​. మూడు స్మార్ట్​ఫోన్లలో రెండు హై ఎండ్ ఫోన్లుగా, ఒక వేరియంట్​ను మిడ్​ రేంజ్​ సెగ్మెంట్లో తీసుకొచ్చింది. ఈ మూడు ఫోన్ల ప్రత్యేకతలు, ధరలు సహా స్మార్ట్​వాచ్​ విశేషాలు చూసేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సినిమా కబుర్లు

కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. 'ఖిలాడి', 'లవ్​స్టోరి', 'అర్జున్​ చక్రవర్తి' తదితర చిత్రాల అప్​డేట్స్​ ఇందులో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

పెళ్లికి సిద్ధమైన ఆర్సీబీ స్పిన్నర్

ఈ ఐపీఎల్​ కోసం తమ జట్టు పూర్తిస్థాయిలో సిద్ధమవుతోందని ఆర్సీబీ డైరెక్టర్ మైక్ హెసన్ స్పష్టం చేశారు. డివిలియర్స్ మార్చి 28న భారత్​కు వస్తాడని వెల్లడించారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

భారత్ క్లీన్​స్వీప్

దిల్లీలో జరుగుతోన్న షూటింగ్ ప్రంపచకప్​లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. మహిళల 25 మీటర్ల పిస్టోల్ విభాగంలో అన్ని పతకాలను కైవసం చేసుకుంది మన మహిళ షూటర్ల బృందం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details