తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News Today టాప్​న్యూస్ 5PM - Telangana News Today

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

5pm topnews
5pm topnews

By

Published : Aug 25, 2022, 4:59 PM IST

  • గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్టు

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ పలు పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు అందడంతో పోలీసులు ఆయనకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.

  • టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ జూనియర్ లైన్‌మెన్ పరీక్ష రద్దు

టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ జూనియర్ లైన్‌మెన్ పరీక్ష రద్దు అయ్యింది. జూలై 17న వెయ్యి పోస్టులకు రాత పరీక్ష నిర్వహించారు. 181 మంది అభ్యర్థులు మాల్ ప్రాక్టీస్​కు పాల్పడినట్లు విచారణలో నిర్ధారణ అయ్యింది. హైదరాబాద్, రాచకొండ పోలీసుల విచారణలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

  • 'మోదీ ప్రభుత్వాన్ని పారద్రోలితేనే బాగుపడతాం'

మోదీ ప్రభుత్వాన్ని పారద్రోలితేనే మనం అన్ని రంగాల్లో బాగుపడతామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. రంగారెడ్డి జిల్లా కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం జరిగిన సభలో కేసీఆర్ కేంద్రంపై విరుచుకుపడ్డారు.

  • ఇదంతా జరగడానికి కారణం తెరాస, ఎంఐఎం పార్టీలేనన్న రాజాసింగ్‌

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా మరో వీడియో విడుదల చేశారు. ఇదంతా జరగడానికి తెరాస, ఎంఐఎం పార్టీలేనని ఆరోపించారు. ఏ మతాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు.

  • వరంగల్ నిట్ డిప్యూటీ రిజిస్ట్రార్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు

వరంగల్‌ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ (నిట్‌)లో లైంగిక వేధింపుల కలకలం రేగింది. నిట్ డిప్యూటీ రిజిస్ట్రార్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. డిప్యూటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరన్‌పై కాజీపేట పీఎస్‌లో నిట్ మహిళా సెక్యూరిటీలు ఫిర్యాదు చేశారు. లైంగికంగా వేధిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేపట్టారు. అసలేం జరిగిందో విచారణ జరుపుతున్నారు.

  • పగపట్టిన పాములు, 25 ఏళ్లుగా ఆ కుటుంబమే టార్గెట్, నాలుగేళ్లకోసారి కాట్లు

పాముకాట్లు ఓ కుటుంబాన్ని 25 ఏళ్లుగా వెంటాడుతున్నాయి. ప్రతి నాలుగైదేళ్లకు ఒకరు పాముకాటుకు గురవుతున్నారు. అందులో కొందరు ప్రాణాలు కోల్పోయారు. కుటుంబంలోని పురుషులను మాత్రమే పాములు కరవడం, పొలం పనుల కోసం వెళ్తున్న క్రమంలో ఒకేచోట ప్రమాదం జరుగుతుండటం వల్ల కుటుంబీకులు భయాందోళనకు గురువుతున్నారు.

  • న్యాయపాలనా దక్షుడు, వాస్తవికవాది, అత్యుత్తమ భారత ప్రధాన న్యాయమూర్తి

న్యాయవ్యవస్థ అవసరాలను తీర్చేందుకు జస్టిస్‌ ఎన్‌.వి.రమణ విశేషంగా కృషి చేశారని పలువురు న్యాయవాదులు ప్రశంసించారు. భారత ప్రధాన న్యాయమూర్తులలో ఆయన అత్యుత్తమమైనవారని కొనియాడారు. అద్భుతమైన ప్రగతిశీల దృక్పథం ఉన్న ఆయన న్యాయ వ్యవస్థ అవసరాలను వేగంగా తీర్చగలిగారని ప్రశంసలు కురిపించారు.

  • భారీగా పెరిగిన బంగారం ధర, ఏపీ తెలంగాణలో ఎంతంటే

దేశంలో గురువారం బంగారం ధర భారీగా పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • క్రికెట్​ ఫ్యాన్స్​కు గుడ్‌న్యూస్‌, భారత్​ పాక్​ మ్యాచ్​ టికెట్స్​ రిలీజ్​

క్రికెట్​ అభిమానులకు గుడ్​ న్యూస్​. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్​లో భాగంగా జరగబోయే భారత్​ పాకిస్థాన్ మ్యాచ్​కు సంబంధించి నాలుగు వేలకుపైగా స్టాండింగ్‌ రూమ్‌ టికెట్లను విడుదల చేసింది ఐసీసీ. ఒక్కో టికెట్‌ 30 ఆస్ట్రేలియన్ డాలర్లకు ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌ పద్ధతిలో కేటాయిస్తామని వెల్లడించింది.

  • కరణ్‌ జోహార్‌ కోసమే ఆ బోల్డ్ పాత్ర చేశానన్న కియారా

నటిగా పరిశ్రమలోకి అడుగుపెడుతున్నానని చెప్పిన దానికంటే కాఫీ విత్‌ కరణ్‌ షోలో పాల్గొంటున్నానని చెప్పినప్పుడే తన స్నేహితులు సంతోషించారని చెప్పారు నటి కియారా అడ్వాణీ. తాజాగా బాలీవుడ్​ నటుడు షాహిద్​ కపూర్​తో కలిసి ఈ షోలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details