తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @9AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana latest news updates today till now
టాప్​టెన్ న్యూస్ @9AM

By

Published : Dec 13, 2020, 9:00 AM IST

  • రెండోదఫా పాలనకు రెండేళ్లు..

కేసీఆర్ సర్కార్ రెండోదఫా పాలనకు నేటికి రెండేళ్లు. తొలివిడతలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ కొత్తవాటిని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. సంక్షేమానికి పెద్ద పీటవేస్తూనే.. వ్యవసాయరంగానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. రెండేళ్ల కాలంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • గచ్చిబౌలిలో ప్రమాదం

హైదరాబాద్​ గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • చిరుత సంచారం!

గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రోడా మిస్త్రీ కళాశాలలో కుక్కను ఎత్తుకెళ్లినట్లు చెబుతున్నారు. చిరుత ఆనవాళ్ల కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. స్థానికుల సమాచారంతో.. పరిసరాల్లోని సీసీ కెమెరా దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • కశ్మీర్​లో ఆరో విడత పోలింగ్​

జమ్ముకశ్మీర్​ స్థానిక సంస్థల ఎన్నికల(డీడీసీ)కు నాలుగో విడత పోలింగ్ జరుగుతోంది. మొత్తం 31 స్థానాలకు 245మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 7లక్షల మందికిపైగా ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశముంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఒకటే ప్రవేశపరీక్ష..

వచ్చే విద్యాసంవత్సరం (2021-22) నుంచి దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఒక్కటే ప్రవేశ పరీక్ష నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారతీయ వాణిజ్యం, పరిశ్రమల సమాఖ్య(ఫిక్కీ) సదస్సులో కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి అమిత్‌ ఖరే ఈ విషయాన్ని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • చిన్నారి ఆవిష్కరణ..

కేవలం 12ఏళ్ల వయసులోనే ప్రపంచస్థాయి పరిశోధనకు తెర తీసింది ఆ చిన్నారి. మన చుట్టూ ఉండే వస్తువులు గ్లోబల్​ వార్మింగ్​, వాతావరణ మార్పులకు ఏవిధంగా దోహదపడుతున్నాయి అనే విషయాన్ని నిశితంగా గమనించి వాటికి చెక్​ చెప్పాలని సంకల్పిందించి. బట్టలు ఇస్త్రీ చేసేవాళ్లు వాడే బొగ్గు వల్ల ఏర్పడే కాలుష్యం, వారికి అయ్యే ఖర్చు గురించి ఆలోచించింది. ఆ తలపుల్లోంచి పుట్టుకు వచ్చిందే సౌరశక్తితో పని చేసే ఐరనింగ్​ బండి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • 2021 లో 'కొవిషీల్డ్​'

భారత్​లో వచ్చే ఏడాది తొలినాళ్లలోనే ఆక్స్​ఫర్డ్​ టీకా 'కొవిషీల్డ్​' అందుబాటులోకి వస్తుందని తెలిపారు ఆస్ట్రాజెనికా ఇండియా అధ్యక్షుడు గగన్​దీప్​ సింగ్​. అత్యవసర వినియోగానికి త్వరలోనే అనుమతులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ టీకా 2-8 డిగ్రీల ఉష్ణోగ్రతల స్థాయిల్లోనే నిలువ చేసే వీలున్నందున దేశవ్యాప్తంగా వేగంగా సరఫరా చేసే వీలుకలుగుతుందని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • అమెరికా పునరాగమనం!

2015 పారిస్​ వాతావరణ ఒప్పందంలోకి అమెరికా మళ్లీ పునరాగమనం చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు తాను పగ్గాలు చేపట్టిన తొలిరోజే ఈ ఒడంబడికలో చేరతామని అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్​ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • బతికే ఉన్నాననిపించింది

ఐపీఎల్​ 13వ సీజన్​లో బయోబబుల్​లో ఉండటం వల్లే తాను మంచి ప్రదర్శన చేయలేకపోయానని తెలిపాడు కోల్​కతా నైట్​ రైడర్స్​ ఆటగాడు రసెల్​. బాగా ఆడటానికి చాలా ప్రయత్నించినట్లు చెప్పాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • పట్టువీడని నిర్మాతలు..

వీపీఎఫ్‌ (వర్చువల్‌ ప్రింట్‌ ఫీ) వసూలు... రెవెన్యూ షేరింగ్‌ తదితర విషయాలపై మల్టీప్లెక్స్‌ థియేటర్ల యాజమాన్యాలకు, నిర్మాతలకు మధ్య జరుగుతోన్న చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోనే ఉంది. నిర్మాతల డిమాండ్లను మల్టీప్లెక్స్‌ యాజమాన్యాలు అంగీకరించకపోవడమే ఇందుకు కారణం. థియేటర్లలో కొత్త సినిమాల విడుదలపై సందిగ్ధత నెలకొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details