తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రాభివృద్ధిలో సాంకేతికత ప్రధానమైనది : కేటీఆర్ - central scientific advisor vijay raghavan

హైదరాబాద్​ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ క్లస్టర్.. ఉత్పత్తులు, సామాజిక సమస్యల పరిష్కారంలో ఉపయోగపడుతుందని కేంద్ర సైంటిఫిక్ అడ్వైజర్ విజయ్ రాఘవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఐటీ మంత్రి కేటీఆర్​తో కలిసి ఈ క్లస్టర్​ను ప్రారంభించారు.

science and innovation cluster in Hyderabad
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్

By

Published : Jan 8, 2021, 7:12 PM IST

సాంకేతికత రాష్ట్రాభివృద్ధిలో ప్రధానమైనదని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన సైన్స్ అండ్ ఇన్నోవేషన్ క్లస్టర్​తో ఇక్కడ అభివృద్ధి చేసిన ఉత్పత్తులు మార్కెట్​లోకి వెళ్లి ప్రజల జీవితాలను మార్చేందుకు ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

కేంద్ర సైంటిఫిక్ అడ్వైజర్​ విజయ్ రాఘవన్​తో కలిసి హైదరాబాద్​లో సైన్స్ అండ్ ఇన్నోవేషన్ క్లస్టర్​ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రానున్న 5 ఏళ్లలో రాష్ట్రంలో ఐదు ప్రభావవంతమైన కంపెనీలను ప్రారంభించేందుకు ఈ క్లస్టర్ సాయం చేస్తుందని తెలిపారు. ఇన్నోవేషన్​లో తెలంగాణను మొదటి స్థానంలో నిలుపుతామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details