మూసీనది కాలుష్యంపై ఈనాడుదినపత్రిక కథనానికి రాష్ట్ర ఉన్నతన్యాయస్థానం స్పందించింది. మూసీనది కాలుష్యం సుమారు 66 గ్రామాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఈ నెల 18న ఈనాడు కథనం ప్రచురితమైంది. మూసీ.. బతుకు మసి పేరిట ప్రచురితమైన ఈ కథనాన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.
ఈనాడు కథనానికి స్పందన... సుమోటోగా స్వీకరించిన హైకోర్టు - మూసీ నదిపై ఈనాడు కథనానికి స్పందన
మూసీ కాలుష్యంపై "ఈనాడు" కథనానికి హైకోర్టు స్పందించింది. ఈనెల 18న ఈనాడులో ప్రచురితమైన "మూసీ.. బతుకు మసి" కథనాన్ని సుమోటోగా స్వీకరిచింది.
మూసీ.. బతుకు మసి
ప్రజాప్రయోజనవ్యాజ్యంగా స్వీకరించిన ఉన్నతన్యాయస్థానం... రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, పర్యావరణ, పురపాలక, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శులు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జలమండలి, కాలుష్యనియంత్రణ మండలి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్లను ప్రతివాదులుగా చేర్చింది.
ఇదీ చూడండి: ఈనెల 28న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.. ఆర్టీసీపై చర్చ!!
Last Updated : Nov 26, 2019, 12:53 PM IST