తెలంగాణ

telangana

ETV Bharat / city

TS High Court On Pubs: నూతన సంవత్సర వేడుకల్లోపే పబ్​లపై చర్యలు తీసుకోండి: హైకోర్టు - ts high court orders on pubs

telangana high court
telangana high court

By

Published : Dec 29, 2021, 4:26 PM IST

Updated : Dec 29, 2021, 5:28 PM IST

16:19 December 29

నూతన సంవత్సర వేడుకల్లోపే పబ్​లపై చర్యలు తీసుకోండి: హైకోర్టు

TS High Court On Pubs: నివాస ప్రాంతాల్లో పబ్​ల నియంత్రణపై ఏం చర్యలు తీసుకున్నారో.. రేపు తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. జూబ్లీహిల్స్ రెసిడెంట్స్ క్లీన్ అండ్ గ్రీన్ అసోసియేషన్ పిటిషన్​పై హైకోర్టు ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది.

ఇళ్ల మధ్య పబ్​ల వల్ల శబ్ద కాలుష్యం, రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయి స్థానికులు ఇబ్బంది పడుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. పబ్​లు, బార్లకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కొన్ని ప్రాంతాల్లో పదుల సంఖ్యలో పబ్​లు, బార్లు ఉన్నాయని న్యాయస్థానం ప్రస్తావించింది. యువతను దృష్టిలో ఉంచుకొని పబ్​లపై నియంత్రణ చర్యలు ఉండాలని హైకోర్టు అభిప్రాయపడింది. కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేసి జరిమానాలు విధిస్తే సరిపోతుందా అని వ్యాఖ్యానించింది. పబ్​లు, బార్లు పాటించాల్సిన మార్గదర్శకాలపై ఉత్తర్వులు జారీ చేస్తామని.. కొంత సమయం ఇవ్వాలని అదనపు ఏజీ రామచంద్రరావు కోరారు. నూతన సంవత్సర వేడుకల్లోపే ఉత్తర్వులు ఇవ్వాలని స్పష్టం చేసిన హైకోర్టు.. సంబంధించిన వివరాలను రేపు తమకు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఘర్షణలు, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా పబ్​లు..

ఇటీవల హైదరాబాద్​లోని పలు పబ్​లపై టాస్క్​ఫోర్స్​ దాడుల సందర్భంగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొవిడ్​ నిబంధనలు గాలికొదిలేయడం సహా.. డ్యాన్సింగ్, మ్యూజిక్ ఫ్లోర్లను తెరుస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు పోలీసులు చెప్పారు.

హైదరాబాద్ బేగంపేటలోని టాలీవుడ్ క్లబ్​ పబ్‌పై పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడుల సందర్భంగా.. పబ్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించారు. 33 మంది పురుషులతో పాటు 9 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. పబ్​లలో నిత్యం ఘర్షణలు, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు పలుమార్లు ఫిర్యాదులు అందాయని పోలీసులు చెబుతున్నారు.

ఇదీచూడండి:TS High Court: హైకోర్టు దృష్టికి కొత్త సంవత్సర వేడుకల వ్యవహారం...

Last Updated : Dec 29, 2021, 5:28 PM IST

ABOUT THE AUTHOR

...view details