కరోనా యోధులు అందించిన సేవలకు కృతజ్ఞతగా తొలిటీకా వారికే అందిస్తున్నామని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. మహమ్మారి అంతం... వ్యాక్సిన్ ఆరంభమయ్యే ఈ సమయం కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తుందని తెలిపారు.
ఈ సమయం కోసమే ప్రపంచమంతా ఎదురుచూస్తోంది : గవర్నర్ - Governor's comments on vaccination in telangana
ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా కొవిడ్ వ్యాక్సిన్‌ను తయారు చేసుకోవటం భారత్‌కు గర్వకారణమని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా... ప్రజలంతా కొవిడ్ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని గవర్నర్ సూచించారు.