వణ్యప్రాణుల మనుగడకు ప్రాణసంకటంగా మారుతున్న ప్లాస్టిక్ నివారణకు అటవీశాఖ నడుం బిగించింది. అమ్రాబాద్ టైగర్ రిజర్వులో ఇటీవల చెత్త తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. సుమారు వెయ్యి కేజీల ప్లాస్టిక్, ఇతర చెత్తను అటవీ ప్రాంతాల నుంచి సేకరించారు. ఈ ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్‌కు పంపారు.
ఇదే స్ఫూర్తితో.... రాష్ట్రంలో ఉన్న రెండు టైగర్ రిజర్వులు, మూడు జాతీయ ఉద్యాన వనాలు , నాలుగు అభయారణ్యాలు, 109 అర్బన్ జూపార్కులు ఇతర జూలలో ప్లాస్టిక్ ను పూర్తిగా నియంత్రించాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.ఎం.డోబ్రియల్ ఆదేశాలు జారీ చేశారు. అన్ని అటవీ ప్రాంతాల్లో చెత్త సేకరణను ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయటం.. రీ సైకిల్ పాయింట్ల ఏర్పాటు, చెత్తను విడతీయటం, సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్, బెయిలింగ్, ప్రాసెసింగ్ యూనిట్‌కు తరలింపును దశల వారీగా చేపట్టనున్నారు. ఈ విధానంలో అడవులపై ఆధారపడి జీవించే స్థానికులకు కొంత ఉపాధి కూడా దొరికే అవకాశం ఉంది.