జాతీయ ఉపాధి హామీ పథకం రోజువారి కూలీ పెరిగింది. ఇప్పటివరకు రూ.237 ఉన్న కూలీని రూ.245కు పెంచారు. వేసవి నేపథ్యంలో కూలీ రేట్లను ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దాని అనుగుణంగా రాష్ట్రంలోనూ రోజువారి కూలీని రూ.245కి పెంచారు.
రూ.245కు పెరిగిన ఉపాధి హామీ రోజువారి కూలీ
రాష్ట్రంలో జాతీయ ఉపాధి హామీ పథకం రోజువారి కూలీ పెరిగింది. రూ.237 ఉన్న కూలీని రూ.245కి పెంచుతూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
పెరిగిన ఉపాధి కూలీ, ఉపాధి కూలీ, తెలంగాణ న్యూస్
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పెరిగిన కూలీ అమల్లోకి వస్తుంది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
- ఇదీ చదవండి :నిలకడగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం