తెలంగాణ

telangana

ETV Bharat / city

పోటెత్తనున్న పామాయిల్.. ఐదేళ్లలో 10 లక్షల టన్నుల ఉత్పత్తి - oil palm farmers in telangana

తెలంగాణ రాష్ట్రం పామాయిల్ తోటలతో కళకళలాడనుంది. ప్రస్తుతం ఏటా 40వేల టన్నులు ఉన్న ఉత్పత్తిని ఐదేళ్లలో 10 లక్షల టన్నులు చేసేలా రాష్ట్ర నూనెగింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య ప్రణాళికలు రచిస్తోంది.

Oil palm cultivation, palm oil cultivation, palm oil cultivation in Telangana
ఆయిల్​పామ్ సాగు, పామాయిల్ సాగు, తెలంగాణలో పామాయిల్ సాగు

By

Published : Jun 20, 2021, 8:01 AM IST

రాష్ట్రంలో వచ్చే నాలుగైదేళ్లలో ఏటా 10 లక్షల టన్నుల పామాయిల్‌ను ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ఉత్పత్తి 40 వేల టన్నులే. రానున్న రోజుల్లో కొత్తగా మూడు పామాయిల్‌ ఉత్పత్తి మిల్లులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర నూనెగింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య (ఆయిల్‌ఫెడ్‌) ప్రణాళికను రూపొందించింది. వీటి ఏర్పాటుకు నాలుగేళ్లలో తొలి దశ కింద రూ.500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.

వీటి ఏర్పాటుకు జోగులాంబ జిల్లా బీచుపల్లితోపాటు సిద్దిపేట, మహబూబాబాద్‌ల్లో 60 ఎకరాల చొప్పున భూములు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం ఆయిల్‌ఫెడ్‌కు భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట, దమ్మపేటల్లో రెండు నూనె మిల్లులున్నాయి. వీటి పరిధిలో 30 ఎకరాల్లో మాత్రమే ఆయిల్‌పాం తోటలున్నాయి. రాబోయే అవసరాల కోసం ఏకంగా లక్షా 62 వేల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేపట్టాలని నిర్ణయించారు.

ఆయిల్‌ఫెడ్‌ ఒక్కటే కాకుండా 7 ప్రైవేటు కంపెనీలతోనూ పామాయిల్‌ మిల్లుల ఏర్పాటుకు ఆయిల్‌ఫెడ్‌ ప్రణాళిక తయారుచేసింది. ఈ కంపెనీలకు జిల్లాల వారీగా 6.91 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగుకు అనుమతిస్తూ రాష్ట్ర ఉద్యానశాఖ ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది.

ఆయిల్​పామ్ సాగుతో రైతులకు ఉజ్వల భవిష్యత్​ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ పంటతో కర్షకులకు ఆర్థిక భరోసా కలుగుతుందని తెలిపారు. ఆయిల్​పామ్ సాగు చేసే వారికి సర్కార్ సబ్సిడీ కూడా ఇస్తోందని.. అందుకే ఆయిల్​పామ్ సాగు చేసి అధిక దిగుబడి సాధించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details