Telangana letter to KRMB: కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు రాష్ట్ర ఈఎన్‌సీ మురళీధర్ మరోసారి లేఖ రాశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో పేర్కొన్న రెండు అంశాలను ఒక్కటిగా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ కృష్ణానది యాజమాన్య బోర్డు ఛైర్మన్‌కు లేఖ రాశారు. గెజిట్ నోటిఫికేషన్‌లో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం రెండో కాంపోనెంట్‌ను 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు పెంచినట్టు చూపించడం తప్పని లేఖలో ప్రస్తావించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ప్రభుత్వం కల్వకుర్తి ఆయకట్టును 2.5 లక్షల నుంచి 3.65 లక్షల ఎకరాలకు పెంచిందని, అందుకు తగ్గట్లు నీటి కేటాయింపులు మాత్రం పెంచలేదని పేర్కొన్నారు. పెంచిన ఆయకట్టుకు సరిపొయే నీటి కేటాయింపులను మాత్రమే తెలంగాణ ప్రభుత్వం చేసిందని.. కొత్తగా ఆయకట్టును పెంచలేదని స్పష్టం చేశారు. ఆయకట్టు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను లేఖకు జత చేసినట్లు ఆయన తెలిపారు.
Telangana letter to KRMB: కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు రాష్ట్ర ఈఎన్‌సీ మురళీధర్ మరో లేఖ
14:46 December 19
Telangana letter to KRMB: కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు రాష్ట్ర ఈఎన్‌సీ మురళీధర్ మరో లేఖ
kalwakurthy lift irrigation scheme: కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 800 అడుగుల వద్ద నీటిని తీసుకునేట్లు 2006 లోనే బ్రిజేశ్ ట్రైబ్యునల్‌కు అందచేసిన డీపీఆర్‌లో పేర్కొన్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులైన జీఎన్ఎస్ఎస్, వెలిగొండ, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, టీజీపీ ప్రాజెక్టు రిపోర్టులను కూడా బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట నివేదించామని, ఎఫ్‌ఆర్‌ఎల్ 885 అడుగుల వద్ద నీటిని తీసుకునేట్లు డిజైన్ ఉందని పేర్కొన్నారు. కృష్ణానది బేసిన్‌లోని ప్రాజెక్టు కాబట్టే 800 అడుగుల వద్ద, బేసిన్ ఆవలివి కాబట్టే ఆంధ్ర ప్రాజెక్టులను పూర్తి రిజర్వాయర్ మట్టం 885 అడుగుల వద్ద తీసుకునే విధంగా డిజైన్ చేశారని స్పష్టం చేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను కూడా అదే కారణంగా 800 ఫీట్ల వద్ద డిజైన్ ఉన్నట్లు వివరించారు.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం సెక్షన్ 89 ప్రకారం కొనసాగుతున్న కేడబ్ల్యూడీటీ-II వద్ద ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం 75 శాతం విశ్వసనీయత గల నికర జలాలను కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు కేటాయించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ మాత్రం జీఎన్ఎస్ఎస్, వెలిగొండ, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, టీజీపీ ప్రాజెక్టు తదితర ప్రాజెక్టులకు మిగులు జలాల కేటాయింపు మాత్రమే కోరినట్లు ఆ లేఖలో స్పష్టం చేసినట్లు తెలిపారు. 75 శాతం విశ్వసనీయత గల నికర జలాలు కేటాయించాలని కోరలేదని తెలంగాణ స్పష్టం చేసింది. తెలంగాణ ప్రాజెక్టులకు జరిగిన చారిత్రిక అన్యాయాలను సవరించడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గెజిట్ నోటిఫికేషన్ నుంచి కల్వకుర్తి రెండో భాగాన్ని 1.15ను తొలగించడానికి చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌ఎంబీని కోరామని.. ఈ లేఖ ప్రతిని అనుబంధాలతో సహా కేంద్ర జల్‌శక్తి మంత్రికి తదుపరి చర్యల కోసం పంపనున్నట్లు ఈఎన్సీ వివరించారు.
ఇవీ చూడండి: