కరోనా సోకి హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్న వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం టెలీ మెడిసిన్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇరవై నాలుగు గంటలపాటు పని చేస్తుంది. ఎటువంటి సందేహాలు వచ్చినా 1800 599 4455కు ఫోన్ చేయవచ్చు. ప్రభుత్వం ఈ సేవలను ఉచితంగా అందిస్తోంది. హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితులకు సలహాలు, సూచనలు ఇస్తారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మానసిక ఆందోళనలో ఉన్నవారికి కౌన్సెలింగ్ ఇస్తారు.
హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికోసం కాల్ సెంటర్
కరోనా పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరూ ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాల్సిన అవసరం లేదని, హోం ఐసోలేషన్‌లో ఉంటూ వైరస్‌ను జయించవచ్చని వైద్యారోగ్య శాఖ చెబుతోంది. అలా ఇంట్లో ఉంటూ చికిత్స పొందుతున్న వారికోసం తెలంగాణ ప్రభుత్వం 24 గంటల కాల్‌సెంటర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎలాంటి సందేహాలున్న 1800 599 4455కి ఫోన్ చేయవచ్చు. జాగ్రత్తలు, చికిత్స విధానం, సూచనలు అందిస్తారు.
పాజిటివ్ వచ్చిన వారు 17 రోజుల పాటు హోం ఐసోలేషన్ ఉండాలి. ప్రతి రోజు రాష్ట్ర వ్యాప్తంగా హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితులకు కాల్‌సెంటర్ నుంచి ఫోన్ చేసి ఆరోగ్య వివరాలు తెలుసుకుంటారు. అవసరమైన వారికి వైద్యులతో వీడియో కన్సల్టెషన్ ద్వారా మెడికల్ అడ్వైజ్ ఇస్తారు. వాట్సాప్ ద్వారా మందుల వివరాలను పంపిస్తారు. లక్షణాలు ఎక్కువైనా... ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందైనా... వెంటనే 108 ద్వారా వారిని ఆస్పత్రిలో చేరుస్తారు. ప్రతి ఒక్కరికి ఆస్పత్రిలో చికిత్స అవసరం ఉండదు. ఇంట్లో ఉన్నవారికి కూడా కాల్ సెంటర్ ద్వారా ధైర్యాన్ని కల్పిస్తారు.
ఇదీ చదవండి:గాంధీలో కరోనా పరీక్షలు ఎందుకు నిర్వహించడం లేదు: హైకోర్టు