రాష్ట్రంలో తాజాగా 41 వేల 675 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా... అందులో 1416 మందికి వైరస్ సోకిందని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరో 887మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉన్నట్టు తెలిపింది. వీటితో కలిపి ఇప్పటి వరకు వైరస్ భారిన పడిన వారి సంఖ్య 240048కి చేరింది. ఇక మరో 1579 మంది కోలుకోగా... ఇప్పటి వరకు వారి సంఖ్య 220466 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. మరో ఐదుగురు మహమ్మారికి బలవ్వగా వైరస్ మరణాలు 1341కి పెరిగాయి.
రాష్ట్రంలో రెండున్నర లక్షలకు చేరిన కరోనా కేసులు
08:37 November 08
రాష్ట్రంలో రెండున్నర లక్షలకు చేరిన కరోనా కేసులు
రాష్ట్రంలో ప్రస్తుతం మరణాల శాతం కేవలం 0.55 ఉండగటం గమనార్హం. మరణాల శాతం తక్కువగా ఉన్నప్పటికీ... శరీరంలోని ఇతర భాగాలపై వైరస్ ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ సూచిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 18241యాక్టివ్ కేసులు ఉండగా అందులో 15388 మంది ఐసోలేషన్లో ఉన్నారు.
ఇక తాజాగా వచ్చిన కేసుల్లో ఆదిలాబాద్ 18, భద్రాద్రి కొత్తగూడెం 79, జీహెచ్ఎంసీ 279, జగిత్యాల 33, జనగామ 21, జయశంకర్ భూపాలపల్లి 15, జోగులాంబ గద్వాల 10, కామారెడ్డి 24, కరీంనగర్ 74, ఖమ్మం 74, కుమురంభీం ఆసిఫాబాద్ 9, మహబూబ్నగర్ 21, మహబూబాబాద్ 16, మంచిర్యాల 26, మెదక్ 15, మల్కాజిగిరి 112, ములుగు23, నల్గొండ 23, నారాయణపేట 2, నిర్మల్ 7, నిజామాబాద్ 29 , పెద్దపల్లి 21, సిరిసిల్ల 29, రంగారెడ్డి 132, సంగారెడ్డి 25, సిద్దిపేట 40, సూర్యాపేట 37, వికారాబాద్ 16, వనపర్తి 20, వరంగల్ రూరల్ 22, వరంగల్ అర్బన్ 48, యాదాద్రి భువనగిరిలో 34 కేసులు వచ్చినట్టు వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: ప్రశాంతత పరిఢవిల్లేలా... ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా