భారతీయ జనత పార్టీ మున్సిపల్ ఎన్నికల ప్రణాళికను భాజపా కార్యాలయంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు విడుదల చేశారు. 100 గజలలోపు స్థలంలో నివాసముంటున్న కుటుంబాలకు ఇంటిపన్ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 100 రోజుల్లో అన్ని పురపాలికల్లో ఆస్తి పన్నును హేతుబద్ధీకరిస్తామని రామంచంద్రరావు వెల్లడించారు.
భాజపా మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల
భాజపా మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. భారీగా హామీలను ప్రకటించింది. 100 రోజుల్లో అన్ని పురపాలికల్లో ఆస్తి పన్నును హేతుబద్ధీకరిస్తామని పేర్కొంది. ప్రతి మున్సిపాలిటీల్లో బస్తి దవాఖానాలు ఏర్పాటు చేస్తామని తెలిపింది.
bjp
అన్ని మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తామని.. పట్టణాల్లో కంప్యూటర్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామన్నారు. వార్డుల వారీగా జనతా దర్బార్ ఏర్పాటు చేసి ఇంటి వద్దకే పాలన అందిస్తామని.. ప్రతి మున్సిపాలిటీల్లో బస్తి దవాఖానాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి మున్సిపాలిటీలో 10 వేల జనాభాకు ఒకటి చొప్పున రూ.5 భోజన కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'రాష్ట్రాలు వేరైనా... సంస్కృతి, సంప్రదాయాలు ఒకటే'