BJP MLAs About Suspension : శాసనసభాపతి రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి.. ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని భాజపా ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. ముగ్గురు ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై.. తాము హైకోర్టును ఆశ్రయించామని.. సభలోకి తిరిగి అనుమతించాలంటూ.. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తీసుకుని ఇవాళ అసెంబ్లీకి వెళతామన్నారు. శాసనసభ ప్రారంభం ముందు ముగ్గురు ఎమ్మెల్యేల వాదనలు స్పీకర్ వినాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ఎమ్మెల్యేలు వెల్లడించారు. ఈటలను సభలో చూడకూడదనే కేసీఆర్ తమను బయటికి పంపారని భాజపా ఎమ్మెల్యేలు ఆరోపించారు.
BJP MLAs About Suspension : 'ఈటల ముఖం చూడకూడదనే సభనుంచి పంపారు' - సస్పెన్షన్‌పై భాజపా ఎమ్మెల్యేలు
BJP MLAs About Suspension : శాసనసభ స్పీకర్ భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ.. రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించాలని భాజపా ఎమ్మెల్యేలు అన్నారు. హైకోర్టు ఉత్తర్వులను పాటించి తమను తిరిగి సభలోకి అనుమతించాలని సభాపతికి విజ్ఞప్తి చేశారు. తమని సస్పెండ్ చేస్తూ.. తెలంగాణ శాసన సభాపతి సభలో తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తాము హైకోర్టును ఆశ్రయించామని అందుకు హైకోర్టు సభలోకి తిరిగి అనుమతించాలని ఇచ్చిన ఉత్తర్వులను తీసుకుని ఇవాళ అసెంబ్లీకీ వెళ్తామన్నారు.
BJP MLAs About Suspension
BJP MLAs Suspension From Assembly : "అన్ని పార్టీల హక్కులను పరిరక్షించడమే స్పీకర్ బాధ్యత కానీ శాసన సభలో గవర్నర్ ప్రసంగం మీద చర్చించే హక్కును హరిస్తున్నారు. గవర్నర్ హక్కులను కాలరాస్తున్నారని అన్నందుకే మమ్మల్ని బహిష్కరించారు. మేం సభలో ఉంటే తెరాస బండారం బయట పడుతుందని బయటకు పంపించారు. ఈటలను సభలో చూడకూడదనే మమ్మల్నందర్ని సభ నుంచి వెళ్లగొట్టారు. సభా హక్కులను ఉల్లంఘించినందుకు సీఎం కేసీఆర్ను బయటకు పంపించాలి."
- భాజపా ఎమ్మెల్యేలు