వానాకాలం పంట వరిధాన్యం సేకరణ విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. వరిధాన్యం సేకరణ కోసం 5,690 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్ కేంద్రాల ద్వారా వరిధాన్యం కొనుగోలు జరగనున్నట్లు సర్కారు తెలిపింది. జీసీసీ, ఏఎంసీ ద్వారా పౌరసరఫరాల శాఖ వరిధాన్యం కొనుగోలు చేయనుంది. హాకా ద్వారా 9 జిల్లాల్లో వరిధాన్యం కొనుగోలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
వానాకాలం పంట వరిధాన్యం సేకరణ విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం - cm kcr latest news
18:17 October 10
వానాకాలం పంట వరిధాన్యం సేకరణ విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం
ఏ-గ్రేడ్ వరికి రూ.1,888, సాధారణ రకం ధాన్యానికి రూ.1,868 కనీస మద్దతు ధరగా నిర్ణయించింది. వానాకాలంలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసిన సర్కారు... సీఎంఆర్ బియ్యాన్ని 15 రోజుల్లో మిల్లర్లు ప్రభుత్వానికి అందించాలని స్పష్టం చేసింది. నిర్దేశిత గడువులోగా బియ్యం ఇవ్వని మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. పీడీఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టించే మిల్లర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
ధాన్యం సేకరణ, సంబంధిత అంశాల కోసం టోల్ ఫ్రీ నంబర్లను 180042500333, 1967 ఏర్పాటు చేసింది. ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షించాలని కలెక్టర్లను ఆదేశించిన సర్కారు... పాత గోనెసంచులను రికవరీ చేయాలని, ప్రతి సీజన్‌కు గోనె సంచులు రికవరీ చేసి నెలవారీ నివేదిక ఇవ్వాలని పేర్కొంది.
ఇదీ చదవండి :రాష్ట్ర కేబినెట్ భేటీ... కీలక బిల్లులపై చర్చ