రైతుల(farmers)ను గోస పెట్టిన ఏ ప్రభుత్వం బతికిబట్టకట్టలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి(Telangana agriculture minister Niranjan reddy) పునరుద్ఘాటించారు. లక్షల కోట్లను కార్పొరేట్లకు ధారాదత్తం చేసే కేంద్రం.. కర్షకుల కోసం వేల కోట్లు ఖర్చు చేయలేదా అని ప్రశ్నించారు. మూడు నల్ల చట్టాల(New agriculture laws)తో రైతుల మెడపై కేంద్రం కత్తి వేలాడదీస్తోందని వాపోయారు. కర్షకులను కష్టపెట్టే ప్రభుత్వాలకు ఉసురు తగులుతుందని అన్నారు. యాసంగిలో పండించేదే బాయిల్డ్ రైస్(para boiled rice procurement) అని.. ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు(paddy procurement) చేయం అంటే అన్నదాతలు ఏం చేస్తారని నిలదీశారు. రైతులను అయోమయానికి గురిచేయొద్దని సూచించారు.
తెలంగాణ భాజపా(Telangana BJP) నేతలు అపరిపక్వత లేని మాటలు మాట్లాడుతున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి(minister Niranjan reddy) అన్నారు. దమ్ముంటే.. కేంద్రం నుంచి యాసంగి వడ్లు కొంటామనే ఉత్తర్వులు తీసుకురావాలని సవాల్ చేశారు. ఏ రాష్ట్రమైన తన అభివృద్ధిలో మందగమనం చూపిస్తే.. పరుగు పెట్టించాల్సిన కేంద్రమే(central government) నిద్రపోతే.. రాష్ట్రాలు నిద్రలేపాల్సిన దుస్థితి ఉందని పేర్కొన్నారు. కేంద్ర సర్కార్ నుంచి సహాయసహకారాలు అందకపోయినా.. తెలంగాణ ప్రభుత్వం తన పరిధిలో ఉన్నంతలో అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తోందని స్పష్టం చేశారు.
"108 కోట్ల జనాభాలో 20-22 కోట్ల మందికి ఇప్పటికీ తిండిగింజలు లేవు. దేశంలోని ధాన్యం నిల్వలను పేదలకు పంచవచ్చు. దేశంలో ఇప్పటికి కూడా ఎంతోమందికి ఆహారం దొరకట్లేదు. రైతుల కోసం వేల కోట్లు ఖర్చు చేసే శక్తి కేంద్ర ప్రభుత్వానికి లేదా? నూనెగింజల ఉత్పత్తిని పెంచాలని మేం కృషి చేస్తున్నాం. వంట నూనెల దిగుమతి కోసం 80 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. దేశంలోనే నూనెగింజల ఉత్పత్తితి కేంద్రం ఎందుకు చర్యలు చేపట్టడం లేదు?. పంట మార్పిడికి అవసరమైన ప్రోత్సాహకం అందించట్లేదు. దేశవ్యాప్తంగా పంట మార్పిడికి కేంద్రమే ఒక విధానాన్ని ప్రకటించొచ్చు. మొత్తం వ్యవస్థలను కేంద్రం చేతుల్లోనే ఉన్నాయి. కొత్త మార్గాలు అన్వేషించకుండా రైతులను గోస పెడుతున్నారు. దిల్లీలోని కేంద్ర పెద్దలు చెప్పే విషయాలను మీ శ్రేణులకే చెప్పవచ్చు కదా?"