ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలురాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య? రాష్ట్రపతి ఎన్నికల వేళ దిల్లీలోని వెంకయ్య నాయుడు నివాసం కీలక భేటీకి వేదికైంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. వెంకయ్యతో సమావేశమయ్యారు.'అగ్నిపథ్‌పై తగ్గేదే లేదు..''అగ్నిపథ్'పై నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ స్పందించారు. సైన్యంలో చేపట్టాల్సిన సంస్కరణల్లో భాగంగానే అగ్నిపథ్ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టిందని అన్నారు.'మీకు దమ్ముంటే.. నా మీద, రాష్ట్ర ప్రభుత్వంపై కేసు పెట్టండి' అధికారంలోకి వచ్చిన 8ఏళ్లలో కేంద్రప్రభుత్వం ప్రజలకు తీరని అన్యాయం చేసిందని మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఐడీపీఎల్ విషయంలో కేసులు వేయండని ఒక కేంద్రమంత్రి అంటున్నారని.. మీకు దమ్ముంటే.. నా మీద, రాష్ట్ర ప్రభుత్వంపై కేసు పెట్టండని కేటీఆర్ సవాల్ విసిరారు. జోరుగా వర్షాలు... బొగ్గు ఉత్పత్తికి ఆటంకంజయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగరేణి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సోమవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి గనుల్లోకి వరద నీరు చేరింది. మోటార్ల ద్వారా నీటిని బయటకు పంపిస్తున్నారు. మైక్ సెట్ చేస్తుండగా విద్యుదాఘాతం.. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం అందనాలపాడులో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోని ఆలయంలో మైక్ సెట్ చేస్తుండగా విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి చెందారు. గతరాత్రి వర్షం కురవడంతో తీగల్లో విద్యుత్ ప్రవహించి అకస్మాత్తుగా కరెంట్ షాక్ వచ్చిందని స్థానికులు చెప్పారు. బార్‌లో పరస్పరం దాడి చేసుకున్న యువతి, యువకులు...హైదరాబాద్ రాయదుర్గం పరిధిలోని ఓ బార్‌లో ఫోన్ నంబర్ విషయంలో.. రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దాంతో యువతి, యువకులు పరస్పరం దాడి చేసుకున్నారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఏకే-47 కేసులో ఎమ్మెల్యేకు పదేళ్లు జైలు శిక్ష ఆర్జేడీ ఎమ్మెల్యే అనంత్ సింగ్‌కు పదేళ్ల జైలు శిక్ష పడింది. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న కేసులో ఆయన్ను దోషిగా తేల్చిన పట్నా ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఈ తీర్పును వెలువరించింది.బ్రిడ్జ్‌పై సెల్ఫీలతో ఆమె బిజీ.. ఫోన్ కొట్టేసి నదిలోకి జంప్..ఓ యువతి వంతెనపై సెల్ఫీ దిగుతుండగా ఫోన్ కొట్టేసిన ఘటన ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో జరిగింది. గంగా హారతి సందర్భంగా నాగ్‌పుర్‌కు చెందిన యువతి కుటుంబం హరిద్వార్‌కు వచ్చింది. ఈ క్రమంలోనే గంగా నది వద్ద యువతి సెల్ఫీ తీసుకుంటుండగా.. ఓ దొంగ ఆమె ఫోన్‌ను లాక్కుని నదిలో దూకాడు. యువతి కేకలు వేయడం వల్ల.. అప్రమత్తమైన యాత్రికులు నదిలో దూకిన దొంగను పట్టుకొని కొట్టారు. 42వ టైటిల్ వేటలో ముంబయి..రంజీ ట్రోఫీ 2022 సీజన్ చివరకు చేరుకుంది. ఫైనల్లో ముంబయి- మధ్యప్రదేశ్ తలపడనున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయిలో 41 సార్లు టైటిల్ గెలుచుకున్న ముంబయి.. 42వ సారి ట్రోఫీని అందుకోవాలన్న పట్టుదలతో ఉండగా.. 23ఏళ్ల తర్వాత తుదిపోరుకు చేరుకున్న మధ్యప్రదేశ్ ఎలాగైనా విజేతగా నిలవాలని ఊవిళ్లూరుతోంది.రూటు మార్చిన స్టార్స్.. ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో సాధరణ నటులే కాదు స్టార్లు కూడా నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖ నటులు ఈ ఓటీటీ బాటలో అడుగులు వేయగా.. మరికొంతమంది తారలు కూడా ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా మెరవబోతున్నారు.