అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం ఎత్తివేత - తెలంగాణలో లాక్‌డౌన్ వార్తలు
16:20 May 31
లాక్‌డౌన్ నిబంధనలు సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
రాష్ట్రంలో కంటైన్మెంట్ జోన్ల వెలుపల లాక్‌డౌన్ జూన్ 7వరకు యథాతథంగా కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు లాక్‌డౌన్ నిబంధనలు సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని స్పష్టం చేసింది. దుకాణాలను రాత్రి 8 గంటల వరకు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది.
అంతర్రాష్ట్ర ప్రయాణాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. కంటైన్మెంట్ జోన్లలో జూన్ నెలాఖరు వరకు లాక్‌డౌన్ యథాతథంగా అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.