అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన వాస్తవ అంశాలను ప్రభుత్వం, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లేందుకు 50 ప్రజా సంఘాల భాగస్వామ్యంతో ఆన్‌లైన్‌లో... 'తెలంగాణ ప్రజా అసెంబ్లీ' నిర్వహించారు. అసంఘటిత కార్మికులు, ఆదివాససీ, దళిత, బహుజన ప్రతినిధులు ఈ సమావేశంలో గొంతుక వినిపించారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కార్మికులకు తక్షణ సహాయం అందించాలని, యువతకు ఉద్యోగాలు అందించాలని డిమాండ్ చేశారు.
ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 'తెలంగాణ ప్రజా అసెంబ్లీ' - తెలంగాణ ప్రజా అసెంబ్లీ
అసెంబ్లీలో చర్చించాల్సిన ప్రజా సమస్యలను... ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో... 'తెలంగాణ ప్రజా అసెంబ్లీ' నిర్వహించారు. కార్మికులకు తక్షణ సాయం, యువతకు ఉద్యోగాలు అందించాలని డిమాండ్ చేశారు.
ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 'తెలంగాణ ప్రజా అసెంబ్లీ'
భూమి హక్కులు, అటవీ హక్కులు, నీటి వనరుల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని... ఈ పరిస్థితి రాకూడదని ఆకాంక్షించారు. లాక్డౌన్ నుంచి నుంచి తేరుకోనేంత వరకు... పనిచేసే వయోజనులందరికీ ప్రతి 3 నెలలకు 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందింంచాలన్న తీర్మాణాన్ని ఆమోదించారు. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ అమలు, ప్రభుత్వ రంగ సంస్థలు పునరుద్ధరించటం, గ్రామాల్లో చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చేసిన తీర్మాణాలను ఆమోదించారు.