తెలంగాణ

telangana

ETV Bharat / city

సీఎం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి - stu

తమ పట్ల సీఎం నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్​ చేశాయి. తార్నాకలోని సెయింట్​ అన్స్​ పాఠశాలలో గంటపాటు పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం నిలిపివేసి నిరసన తెలిపారు.

ఉపాధ్యాయ సంఘాల నిరసన

By

Published : Apr 19, 2019, 6:41 PM IST

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్​ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎస్​టీయూ డిమాండ్​ చేసింది. తార్నాకాలోని సెయింట్​ అన్స్​ పాఠశాల వద్ద గంట పాటు పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం నిలిపివేసి నిరసన తెలిపారు. పదవీ విరమణ వయస్సు 61 సంవత్సరాలకు పెంచాలని, మూల్యాంకనం రేట్లు పెంచాలని, ప్రభుత్వ రంగం బలోపేతానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పీఆర్సీని పాఠశాల పునర్ ప్రారంభానికి ముందే పూర్తి చేసి, నియామక ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఉపాధ్యాయ సంఘాల నిరసన

ABOUT THE AUTHOR

...view details