TDP Mahanadu 2022 : 'తెలుగుదేశం మహానాడు' ఈసారి మే 28న ఒక్కరోజే నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఒంగోలు ప్రాంతంలో నీటి ఎద్దడి, ఎండల తీవ్రత దృష్ట్యా ఒక్క రోజుకే పరిమితం చేయాలని నిర్ణయించినట్లు పార్టీ నేతలు తెలిపారు. మహానాడుకు ముందురోజు మే 27న.. 4 వేల నుంచి 5 వేల మంది పార్టీ ప్రతినిధులతో మహానాడు వేదిక వద్దే విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. ఈ భేటీకి ఆహ్వానితులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. 28న జరిగే మహానాడుకు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారులు సహా ఎవరైనా హాజరు కావొచ్చు. ఆ రోజు భారీ బహిరంగ సభ నిర్వహించనున్న తెలుగుదేశం.. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్ని ఈ సభలోనే ప్రారంభించనుంది. సంవత్సరంపాటు శత జయంతి ఉత్సవాలు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.
TDP Mahanadu 2022 : ఈ ఏడాది ఒక్కరోజే 'తెలుగుదేశం మహానాడు' - tdp mahanadu
TDP Mahanadu 2022 : 'తెలుగుదేశం మహానాడు' ఈ ఏడాది మే 28న ఒక్కరోజే నిర్వహించనున్నారు. ఏపీలోని ఒంగోలు ప్రాంతంలో నీటి ఎద్దడి, ఎండల తీవ్రత దృష్ట్యా ఒక్క రోజుకే పరిమితం చేయాలని నిర్ణయించినట్లు పార్టీ నేతలు తెలిపారు.
TDP Mahanadu 2022
TDP Mahanadu : 28న ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని మహానాడును ఏటా మే 27 నుంచి 29 వరకు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గత రెండేళ్లుగా కొవిడ్ కారణంగా ఆన్‌లైన్‌లోనే మహానాడు నిర్వహించారు. అయితే ఈ ఏడాది ఒంగోలు ప్రాంతంలో నిర్వహించే మహానాడును పరిస్థితుల ప్రభావం వల్ల ఒక్క రోజుకే పరిమితం చేశారు. ఈ ఏడాది మహానాడు కార్యక్రమాన్ని ఒంగోలు సమీపంలో నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి :