కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను చిన్నచూపు చూస్తోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్ర శేఖర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2.31 లక్షల కోట్ల అప్పుందని తెలిపారు. ఆర్టీసీలో 1,200 మంది ఉద్యోగులే ఉన్నారని కేసీఆర్ ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. ఆర్టీసీ రూట్లు ప్రైవేట్ చేస్తేనే ఓ సీఎం తన పదవి కోల్పోయారని గుర్తుచేశారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు సమంజసమేనన్నారు. వారికి అన్నిరకాలుగా మద్దతిస్తామని స్పష్టం చేశారు.
ఎయిర్ బస్‌పై ఉన్న ప్రేమ ఎర్ర బస్సుపై లేదు - rtc jac meeting at somajiguda hyderabad
తెలంగాణ ప్రభుత్వానికి ఎయిర్ బస్‌పై ఉన్న ప్రేమ ఎర్రబస్సులపై లేదని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సమ్మె కొనసాగిస్తున్న ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపారు.
ఎయిర్ బస్‌పై ఉన్న ప్రేమ ఎర్ర బస్సుపై లేదు