ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో దొంగఓట్లు(Fake votes) వేయిస్తూ.. అధికార పార్టీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) విమర్శించారు. తెలుగుదేశం నేతలను పోలీసులతో నిర్బంధించి.. ఇతర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున దొంగఓటర్లను తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. అక్రమాలకు పాల్పడుతున్న అధికార పార్టీ నేతలను వదలి ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలను అదుపులోకి తీసుకొని వేధించడం దుర్మార్గమని అన్నారు.
ఇతర ప్రాంతాల వారిని పోలీసులు ఎలా రానిచ్చారని(Fake votes) లోకేశ్ ప్రశ్నించారు. ఓటమి తప్పదని తెలిసే.. సీఎం జగన్ అడ్డదారులు తొక్కుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు(Vijayavani college in Kuppam) కుప్పంలో దొంగఓట్లు(Fake votes) వేసేందుకు వచ్చిన వారి వీడియోను ఆయన విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ కుప్పంలోని విజయవాణి కళాశాల(Vijayavani college in Kuppam) వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. దొంగ ఓట్లు(Fake votes) వేయించేందుకు స్థానికేతరులను వైకాపా నేతలు తీసుకువచ్చారని తెదేపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాణి పాఠశాలలో బస చేసిన స్థానికేతరులను ఎక్కడి నుంచి వచ్చారు.. ఎందుకొచ్చారని కుప్పం తెదేపా మహిళా నాయకులు ప్రశ్నించారు. తెదేపా నేతల నిలదీతతో స్థానికేతరులు ముఖాలు దాచుకున్నారు. దొంగఓట్లు వేసేందుకు వచ్చిన స్థానికేతరులను అరెస్టు చేయాలని విజయవాణి కళాశాల వద్ద తెదేపా నేతలు ఆందోళన(TDP leaders protest at vijayavani college in kuppam) చేపట్టారు. వీరిపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు. ఈ ఘటనలో ఓ కార్యకర్త స్పృహ కోల్పోయాడు. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.
మాజీ ఎమ్మెల్సీ అరెస్టు...