TDP Leaders Met Governor: ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడలో క్యాసినో వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను తెదేపా నిజనిర్ధరణ కమిటీ కోరింది. స్వల్ప అస్వస్థత కారణంగా గవర్నర్ తమను కలవలేదని... రాజ్‌భవన్ అధికారి సిసోడియాకు చంద్రబాబుకు సమర్పించిన నివేదికను కమిటీ గవర్నర్‌కు అందజేసింది. క్యాసినో నిర్వహణపై వీడియో సాక్ష్యాలు కూడా అందజేసిన కమిటీ... గుడివాడలో తెదేపా నేతలపై దాడి, పోలీసుల వ్యవహారాన్ని వివరించింది. క్యాసినో తర్వాత 13 మంది యువతులు ఈ నెల 17వ తేదీన విజయవాడ నుంచి బెంగళూరు మీదుగా గోవా వెళ్లినట్టు ఆధారాలు అందజేసింది. కొడాలి నానిని మంత్రివర్గం నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేసింది. గుడివాడలో క్యాసినో నిర్వహణపై విచారణ కోరుతూ అధినేత చంద్రబాబు రాసిన లేఖను కూడా సిసోడియాకు కమిటీ అందించింది.
వాటిని క్యాసినోలో వినియోగించారు
గుడివాడ క్యాసినో నిర్వహణపై డీజీపీ, కలెక్టర్ సహా ఎవరికి ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని తెదేపా నిజనిర్ధరణ కమిటీ సభ్యులు ఆరోపించారు. క్యాసినో నిర్వహణ, ఉద్యోగుల సమస్యలు పక్కదోవ పట్టించేందుకే కొత్త జిల్లాల ఏర్పాటు పేరుతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. క్యాసినో నిర్వహణలో అనుమతిలేని విదేశీ మద్యం, డ్రగ్స్ వినియోగం పెద్దఎత్తున జరిగిందన్న నేతలు మనీ ల్యాడరింగ్, విదేశీ మద్యం, డ్రగ్స్ వినియోగంతో పాటు దేశభద్రతకు విఘాతం కలిగించే పరికరాలు క్యాసినోలో వినియోగించారని చెప్పారు. తక్షణమే ఈ వ్యవహారంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
"సాక్ష్యాలతో సహా నివేదికను గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శి సిసోడియాకు అందించాం. నిజాయతీగా పనిచేసే అధికారిని విచారణకు వేసి ఉంటే నిందితులు ఇప్పటికి జైల్లో ఉండేవారు. క్యాసినో అనంతరం 13 మంది యువతలను రాష్ట్రానికి రప్పించినట్లు ఆధారాలు మా వద్ద ఉన్నాయి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ స్పందించి కొడాలి నానిని బర్తరఫ్ చేయాలి. ఎవరూ స్పందించకపోయినా కొడాలి నానిని వదిలిపెట్టబోం." -వర్ల రామయ్య, తెదేపా నేత
రాయచోటిని జిల్లా కేంద్రంగా వ్యతిరేకిస్తూ..రాజంపేటలో విద్యార్దుల ఆందోళన
క్యాసినో నానిగా కొడాలి నాని