తెలంగాణ

telangana

ETV Bharat / city

'కేసీఆర్ సారూ... తెలంగాణలో 3 రాజధానులు లేవెందుకు?'

ఏపీ ముఖ్యమంత్రి మూడు రాజధానుల ప్రకటనను సీఎం కేసీఆర్ సమర్థించారంటూ వచ్చిన వార్తలను ఏపీ తెదేపా తప్పుబట్టింది. తెలంగాణలో 3 రాజధానులు ఎందుకు పెట్టలేదని తెదేపా నేతలు జీవీ ఆంజనేయులు, నక్కా ఆనందబాబు ప్రశ్నించారు.

tdp-criticizes-kcr-for-supporting-three-capitals-in-ap
'కేసీఆర్ సారూ... తెలంగాణలో 3 రాజధానులు లేవెందుకు?'

By

Published : Jan 14, 2020, 10:59 PM IST

ఏపీలో మూడు రాజధానుల ప్రకటనను ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్థించారంటూ వచ్చిన కథనాలపై... ఆ రాష్ట్ర తెదేపా నేతలు జీవీ ఆంజనేయులు, నక్కా ఆనందబాబు తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో మూడు రాజధానులు ఎందుకు పెట్టలేదో కేసీఆర్ సమాధానమివ్వాలని.. మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు. ఏపీ ప్రజలపై ఆర్థిక భారం పెరగాలని కోరుకోవటం, తప్పుడు సలహాలివ్వటం దురదృష్టకరంగా వ్యాఖ్యానించారు.

ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారు : నక్కా ఆనందబాబు

సీఎం జగన్​తో 6 గంటలపాటు చర్చించిన కేసీఆర్.. ఏపీపై విషం చిమ్మారని మాజీమంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. ఉమ్మడి ప్రాజెక్టుల పేరు చెప్పి... ఏపీ నిధులతో తెలంగాణలో ప్రాజెక్టులు ఎలా కడతారని ప్రశ్నించారు. ఏపీ ప్రజల కష్టాలకు కారణమైన కేసీఆర్​కు.. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని విమర్శించారు. ఎన్నికల సమయంలో వైకాపాకు కేసీఆర్ ఆర్థిక సహాయం చేశారని ఆరోపించారు. అందుకే సీఎం జగన్.. కేసీఆర్ కు కృతజ్ఞత చూపిస్తున్నారని ఆనందబాబు ఆక్షేపించారు.

'కేసీఆర్ సారూ... తెలంగాణలో 3 రాజధానులు లేవెందుకు?'

ఇవీ చూడండి: బస్తీమే సవాల్​: గద్వాల సంస్థానంలో పుర సమరం

ABOUT THE AUTHOR

...view details