తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎన్నికల నిర్వహణలో ఎస్​ఈసీ విఫలం: చంద్రబాబు - ఏపీ పంచాయతీ ఎన్నికలపై చంద్రబాబు వ్యాఖ్యలు

ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎస్​ఈసీ విఫలమైందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. అప్రజాస్వామికంగా ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. రాజ్యాంగ వ్యవస్థను నియంత్రించాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉందని చెప్పారు.

ఎన్నికల నిర్వహణలో ఎస్​ఈసీ విఫలం: చంద్రబాబు
ఎన్నికల నిర్వహణలో ఎస్​ఈసీ విఫలం: చంద్రబాబు

By

Published : Feb 11, 2021, 8:15 PM IST

ఆంధ్రప్రదేశ్​లో ఎన్నికలు సక్రమంగా నిర్వహించడంలో ఎస్‌ఈసీ విఫలమైందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఎస్‌ఈసీ తన అధికారాలు పూర్తిగా ఉపయోగించలేదని వ్యాఖ్యానించారు. చట్టంలో నిబంధనలను అమలు చేయలేకపోతున్నారని ఆరోపించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహించే పుంగనూరు నియోజకవర్గంలో అధికార వైకాపా అక్రమాలు అడ్డకోవడంలో ఎస్​ఈసీ విఫలమైందని అన్నారు. పుంగనూరు, రొంపిచర్ల, సోమల, చౌడేపల్లి తదితర ప్రాంతాల్లో నామినేషన్లు పెద్దఎత్తున తిరస్కరణకు గురయ్యాయని చెప్పారు. అడ్డగోలుగా నామినేషన్లు తిరస్కరించి ఏకగ్రీవాలు చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థులకు రక్షణ కావాలని ఎస్‌ఈసీని కోరామని చంద్రబాబు అన్నారు. ఎస్‌ఈసీ విఫలమవడం వల్లే హైకోర్టును ఆశ్రయించామని తెలిపారు.

వైకాపా ప్రభుత్వం బలవంతపు ఏకగ్రీవాలకు పిలుపునిచ్చిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పిలుపును చాలా గ్రామాల్లో ప్రజలు తిరస్కరించారని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల కోసం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అన్నారు.

'గవర్నర్ చోద్యం చూస్తున్నారు..'

ఎస్‌ఈసీపై మంత్రి పెద్దిరెడ్డి ఇష్టారాజ్యంగా మాట్లాడారని చంద్రబాబు ఆగ్రహించారు. ఐఏఎస్‌ అధికారులను సైతం మంత్రి బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను బెదిరించిన మంత్రి పెద్దిరెడ్డిని తక్షణం బర్తరఫ్‌ చేయాలని డిమాండ్ చేశారు. అధికార దుర్వినియోగం జరుగుతున్నా గవర్నర్‌ చోద్యం చూస్తున్నారని అసంతృప్తి చెందారు. రాజ్యాంగ వ్యవస్థను నియంత్రించాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉందని స్పష్టం చేశారు.

సీఈసీకి ఫిర్యాదు..

ప్రజాస్వామ్యంతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదని చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని చెప్పారు. రాష్ట్రంలో దుస్థితిపై సీఈసీకి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రికి కూడా వివరాలు పంపుతున్నామన్నారు.

ఇదీ చదవండి:హైదరాబాద్​ భవిష్యత్​ మీ చేతుల్లోనే.. నూతన కార్పొరేటర్లతో సీఎం

ABOUT THE AUTHOR

...view details