తెలంగాణ

telangana

ETV Bharat / city

పగటి వేషగాళ్లు.. జనం ముందు బుకాయిస్తున్నారు: చంద్రబాబు

ఏపీలోని విశాఖ గాజువాక కూడలిలో తెదేపా అధినేత చంద్రబాబు.. మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైకాపా ప్రభుత్వం ఏబీసీడీ పాలసీ తెచ్చిందన్న చంద్రబాబు.. ఏ అంటే ఎటాక్.. బీ అంటే బర్డెన్.. సీ అంటే కరప్షన్.. డీ అంటే డిస్ట్రక్షన్ అనీ.. ఇదే ప్రస్తుత ఏపీ ప్రభుత్వ విధానమని ఎద్దేవా చేశారు.

cbn
పగటి వేషగాళ్లు.. జనం ముందు బుకాయిస్తున్నారు: చంద్రబాబు

By

Published : Mar 6, 2021, 2:13 PM IST

పగటి వేషగాళ్లు.. పోస్కోను కలిసి.. తిరిగి బుకాయిస్తున్నారంటూ.. తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖలోని గాజువాక కూడలిలో.. పార్టీ నేతలతో కలిసి మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేశారు. ఏపీలో వైకాపా ప్రభుత్వం ఏబీసీడీ పాలసీ తెచ్చిందన్న చంద్రబాబు.. ఏ అంటే ఎటాక్.. బీ అంటే బర్డెన్.. సీ అంటే కరప్షన్.. డీ అంటే డిస్ట్రక్షన్ అనీ.. ఇదే ప్రస్తుత ప్రభుత్వ విధానమని ఎద్దేవా చేశారు.

మద్యంపై రూ.5 వేల కోట్లు తీసుకుంటున్నారని.. దాన్ని అడ్డుపెట్టుకుని రూ.50 వేల కోట్లు అప్పుచేస్తున్నారని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో.. ఏపీలో నిత్యావసరాల ధరలు బాగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 1 నుంచి ఇంటిపన్నులు పెంచబోతున్నారని తెలిపారు.

రాణిరుద్రమ, అల్లూరి, బెబ్బులిపులిలా మీరంతా పోరాడాలి. తెదేపాను గెలిపించాలి. 2029కి ఏపీని దేశంలో నెంబర్‌వన్‌ చేయాలనుకున్నా. అనేక కార్యక్రమాలు తలపెట్టా. ప్రజలకు మంచి చేయలేకపోయానని చాలా బాధపడుతున్నా. నేను పదవులు కోరుకునే వ్యక్తిని కాదు.

- చంద్రబాబు, తెదేపా అధినేత

ఇవీచూడండి:ప్రశ్నించాలనే ఈసారి మండలి బరిలో దిగా: ఎల్​.రమణ

ABOUT THE AUTHOR

...view details