ఏడున్నర శాతం ఫిట్మెంట్ ఆమోదయోగ్యం కాదని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) సచివాలయం వద్ద ఆందోళనకు దిగింది. 45 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని తపస్ నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి, పీఆర్సీ కమిషన్ నివేదికకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బీఆర్కే భవన్ వద్ద టీపీయూఎస్ ఆందోళన - tapas leaders protest in Hyderabad
మెరుగైన వేతన సవరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం - తపస్ సచివాలయం వద్ద ఆందోళనకు దిగింది. బీఆర్కే భవన్ వద్దకు వచ్చిన తపస్ నేతలు భవన్ ముందు బైఠాయించారు.
బీఆర్కే భవన్ వద్ద టీపీయూఎస్ ఆందోళన
మెరుగైన వేతన సవరణ ఇవ్వాలని డిమాండ్ తపస్ నేతలు కోరారు. బదిలీలపై ఇప్పటివరకూ షెడ్యూల్ విడుదల చేయలేదని ఆరోపించారు.బీఆర్కే భవన్ వద్ద బైఠాయించిన తపస్ ప్రతినిధులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు.
- ఇదీ చూడండి :మహాత్మునికి ప్రముఖుల నివాళి...