తప్పుడు ప్రచారం చేస్తున్నారని తలసాని ఫిర్యాదు
సామాజిక మాధ్యమాల్లో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బోనాల ఉత్సవాల్లో చేసిన నృత్యానికి తప్పుడు పాటలు పెట్టిన వారిపై సైబర్ క్రైం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
తప్పుడు ప్రచారం చేస్తున్నారని తలసాని ఫిర్యాదు
సామాజిక మాధ్యమాల్లో ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేయడం మంచి పద్దతి కాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బోనాల పండుగ సందర్భంగా తాను చేసిన నృత్యానికి సోషల్ మీడియాలో తప్పుడు పాటలు పెట్టి ప్రచారం చేసిన వారిపై సైబర్ క్రైం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు మంత్రి తెలిపారు. బోనాల ఉత్సవాల్లో నృత్యం చేసే తనకు మద్యం సేవించే అలవాటు లేదని స్పష్టం చేశారు.