తెలంగాణ

telangana

ETV Bharat / city

CI Suspended in Suicide Case : యువకుడి ఆత్మహత్య కేసు.. సీఐపై సస్పెన్షన్ వేటు

CI Suspended in Suicide Case In AP : ఓ యువకుని ఆత్మహత్య కేసులో పోలీసు అధికారిని సస్పెండ్ చేస్తూ డీఐజీ ఉత్తర్వులు జారీ చేసిన ఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మండపేటలో చోటుచేసుకుంది. ఇంతకీ ఆ యువకుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి ఆత్మహత్యలో సీఐ పాత్ర ఏంటి? డీఐజీ ఎందుకు సీఐని సస్పెండ్ చేశారు?

CI Suspended in Suicide Case
CI Suspended in Suicide Case

By

Published : Mar 9, 2022, 8:03 PM IST

CI Suspended in Suicide Case In AP : ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మండపేట సీఐ దుర్గాప్రసాద్​ను సస్పెండ్ చేస్తూ ఏలూరు రేంజ్ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. సీఐ కొట్టడం వల్లే మండపేటలో యువకుడు కాళీకృష్ణ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని బంధువులు ఆరోపించటంతో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

డీజీపీకి వర్ల రామయ్య లేఖ..

Young Man Suicide Cause CI Suspension : యువకుడు కాళీకృష్ణ ఆత్మహత్యకు కారకుడైన సీఐ దుర్గాప్రసాద్​పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ తెదేపా నేత వర్ల రామయ్య అంతకు ముందు డీజీపీకి లేఖ రాశారు. ఈనెల 6న సీఐ దుర్గా ప్రసాద్ కాళీ కృష్ణ భగవాన్‌ను కస్టడీలోకి తీసుకొని చిత్రహింసలకు గురిచేయడంతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని వర్ల ఆరోపించారు.

అసలేం జరిగిందంటే..

Man Suicide in Mandapeta : మండపేటకు చెందిన ప్రగడ కాళీకృష్ణ భగవాన్‌ (కాళీ)(20) హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. కొన్నాళ్లుగా మండపేటలోనే ఉంటూ తండ్రికి వ్యవసాయంలో సహకరిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన బాలికతో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లి తమ కుమార్తెను వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టౌన్‌ సీఐ దుర్గాప్రసాద్‌ కాళీని ఆదివారం స్టేషనుకు పిలిచి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో అతడ్ని కొట్టారని, మర్మావయవాల వద్ద గాయాలయ్యాయని మృతుడి బంధువులు ఆరోపించారు. ఒక రోజంతా ఒళ్లు నొప్పులతో బాధపడటంతో స్థానిక వైద్యుడికి చూపించామని, మంగళవారం ఉదయం ఇంటినుంచి బయటకు వెళ్లి రాకపోవడంతో వెతకగా ఏడిద రోడ్డులో మరణించి ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో మృతదేహాన్ని అక్కడ నుంచి కలువపువ్వు సెంటరుకు తీసుకొచ్చి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేసేవరకూ కదిలేది లేదని, సీఐని సంఘటన స్థలానికి పిలిపించాలని రాత్రి 8.30 వరకు ఆందోళన కొనసాగించారు.

సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో సంఘటన స్థలానికి చేరుకున్న డీఎస్పీ బాలచంద్రారెడ్డి బాధితులతో చర్చించారు. సీఐని పిలిపించాలని బాధితులు పట్టుబట్టారు. ఇంతలో వైకాపా, జనసేన నాయకులూ అక్కడకు చేరుకున్నారు. బాధితులు ఎవరిపై ఫిర్యాదు చేస్తే వారిపై కేసు నమోదు చేస్తామని డీఎస్పీ వివరించారు. దాంతో.. సీఐ దుర్గాప్రసాద్‌, ఓ కానిస్టేబుల్‌, బాలిక తల్లిదండ్రులతో పాటు కళాశాల ప్రిన్సిపల్‌పై ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేయనున్నట్లు డీఎస్పీ బాలచంద్రారెడ్డి తెలిపారు. అప్పటికీ ఆందోళనకారులు వెళ్లకపోగా.. సీఐని పిలిపించకపోతే ఆత్మాహుతికి పాల్పడతామని మృతుడి సోదరులు అనడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. బాధితులను ఒప్పించడంతో ఎట్టకేలకు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details