శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో సూర్యయాదవ్ కుమార్ తనదైన శైలిలో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. శ్రీలంక నిర్దేశించిన 276 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆదిలోనే ఓపెనర్లను కోల్పోయింది. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ మరో బ్యాట్స్మెన్ మనీశ్ పాండేతో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
Surykumar Yadav: అదరగొట్టిన సూర్యకుమార్ యాదవ్.. కెరీర్లో తొలి హాఫ్ సెంచరీ - రెండో వన్డేలో సూర్య హాఫ్ సెంచరీ
శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో తన రెండో మ్యాచులోనే మిడిలార్డర్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ అదరగొట్టాడు. ఓ ఎండ్లో వికెట్లు పడుతున్నా తనదైన శైలిలో కెరీర్లోనే తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
Surykumar Yadav
మిడిలార్డర్లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 44 బంతుల్లోనే 53 పరుగులు నమోదు చేశాడు. తాను ఆడుతున్న రెండో మ్యాచ్లోనే తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 27 ఓవర్లో బంతిని బౌండరీకి తరలించి అర్ధశతకం పూర్తి చేసిన సూర్య.. శ్రీలంక బౌలర్ సందకన్ బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు.