తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎన్నికల కోడ్ రద్దు.. వాయిదా కొనసాగింపు - స్థానిక ఎన్నికల వాయిదా కొనసాగింపు వార్తలు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను కొనసాగించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఎన్నికల కోడ్‌ ఎత్తివేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ధర్మాసనం రద్దుచేసింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయమని పేర్కొంది. అభివృద్ధి పథకాలను కొనసాగించేందుకు అనుమతి ఇచ్చిన కోర్టు.. పిటిషన్​పై విచారణ ముగించింది.

AP Latest NEWS
AP Latest NEWS

By

Published : Mar 18, 2020, 5:50 PM IST

ఆంధ్రప్రదేశ్​లో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను సుప్రీంకోర్టు సమర్థించింది. ఎన్నికలపై తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎన్నికల కోడ్‌ ఎత్తివేయాలంటూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని రద్దుచేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయమని స్పష్టం చేసింది. అభివృద్ధి పథకాలను కొనసాగించేందుకు అనుమతి ఇచ్చిన కోర్టు.. కొత్త పథకాలు తీసుకురావద్దని సూచించింది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్థానిక ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేస్తూ ఏపీ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఎస్​ఈసీ ఉత్తర్వులను నిలిపివేసి.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని కోరింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. ఎన్నికల వాయిదాను సమర్థించింది.

ఎన్నికల కోడ్ రద్దు.. వాయిదా కొనసాగింపు

ఇవీ చదవండి.. ఎవరిని అడిగి ఎన్నికలు వాయిదా వేశారు'

ABOUT THE AUTHOR

...view details