విద్యుత్ ఉద్యోగుల విభజన: ప్రతివాదులకు సుప్రీం నోటీసులు - supreme court latest news
15:06 August 26
విద్యుత్ ఉద్యోగుల విభజన: ప్రతివాదులకు సుప్రీం నోటీసులు
తెలుగు రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ధర్మాధికారి కమిటీ తుది నివేదికపై తెలంగాణ విద్యుత్ సంస్థలు వేసిన పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. స్థానికత లేని 586 మందిని రాష్ట్రానికి కేటాయించడంపై తెలంగాణ విద్యుత్ సంస్థలు అభ్యంతరం తెలిపాయి. ఉద్యోగులను కేటాయించి వివాదానికి తెరలేపారని వాదనలు వినిపించాయి.
ఈ వాదనపై ఏపీ విద్యుత్ సంస్థలు అభ్యంతరం తెలిపాయి. తమను రిలీవ్ చేసి ఏపీ విద్యుత్ సంస్థలు జీతాలు ఇవ్వడం లేదని ఉద్యోగుల ఆవేదన వ్యక్తం చేశారు. వాదనలు విన్న సుప్రీం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. వీటిపై స్పందించడానికి రెండు వారాల గడువు ఇచ్చి విచారణను వాయిదా వేసింది.
ఇవీ చూడండి:సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు