సుద్దాల హనుమంతు - జానకమ్మ జాతీయ పురస్కార ప్రదానోత్సవం ఈ నెల 13న హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు సుద్దాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సుద్దాల అశోక్ తేజ తెలిపారు. ప్రతి ఏటా ఇచ్చే సుద్దాల అవార్డ్‌ను ఈ సంవత్సరం పీపుల్ స్టార్, ప్రజా చిత్ర దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తికి ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్న పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్, తదితరులు పాల్గోనున్నట్లు తెలిపారు. తన 30 ఏళ్ల సినీ జీవితంలో ప్రజా కవులను గేయ సాహిత్యాన్ని తాను చేసే సినిమాల్లో పరిపూర్ణంగా వినియోగించుకుంటున్న వ్యక్తి ఆర్.నారాయణమూర్తి అని ఆయన తెలిపారు. డబ్బుల కోసం కాకుండా , ప్రజల సమస్యలపై చిత్రాలు నిర్మిస్తున్న ఏకైక వ్యక్తి నారాయణమూర్తి అని సుద్దాల అన్నారు.
ఈ నెల 13న సుద్దాల హనుమంతు - జానకమ్మ పురస్కార ప్రదానోత్సవం - r narayana murthy
సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కార ప్రదానోత్సవం ఈ నెల 13న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ సంవత్సరం పీపుల్ స్టార్ ఆర్.నారాయణమూర్తికి ఇవ్వనున్నట్లు సుద్దాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు అశోక్ తేజ తెలిపారు.
ఈ నెల 13న సుద్దాల హనుమంతు - జానకమ్మ పురస్కార ప్రదానోత్సవం