తెలంగాణ

telangana

ETV Bharat / city

Job mela 2021: ఎమ్మెల్సీ వాణీదేవిని నిలదీసిన నిరుద్యోగులు.. ఊపిరాడనివ్వకుండా ప్రశ్నలు - ఎమ్మెల్సీ వాణిదేవి

హైదరాబాద్ చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయం(city central library)లో జరిగిన జాబ్ మేళా(job mela in hyderabad 2021) కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ వాణిదేవిని నిరుద్యోగులు ముట్టడించారు. నగర కేంద్ర గ్రంథాలయంలో పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలి వచ్చి వాణీ దేవిని నిలదీయటంతో.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరుద్యోగులను శాంతింప చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసినా.. ప్రశ్నల వర్షంతో వాణీదేవిని ఉక్కిరిబిక్కిరి చేశారు.

students siege mlc vani devi at city central library demanded for job notifications
students siege mlc vani devi at city central library demanded for job notifications

By

Published : Oct 2, 2021, 9:29 PM IST

ఎమ్మెల్సీ వాణీదేవిని నిలదీసిన నిరుద్యోగులు.. ఊపిరాడనివ్వకుండా ప్రశ్నలు

ఏడేళ్లుగా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ జారీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వంపై నిరుద్యోగులు మండిపడ్డారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయం(city central library)లో జరిగిన జాబ్ మేళా(job mela in hyderabad 2021) కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ వాణిదేవిని నిరుద్యోగులు ముట్టడించారు. నగర కేంద్ర గ్రంథాలయంలో పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలి వచ్చి వాణీ దేవిని నిలదీయటంతో.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరుద్యోగులను పోలీసులు శాంతింప చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసినా.. వాణీదేవిని ప్రశ్నల వర్షంతో నిలదీశారు. ఓ సందర్భంలో నిరుద్యోగులపై వాణీదేవి ఆసహనం వ్యక్తం చేశారు.

రాజీనామా ఎప్పుడు చేస్తారు...?

ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసే విధంగా సీఎం కేసీఆర్​పై ఒత్తిడి తీసుకురావాలని నిరుద్యోగులు డిమాండ్​ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఉద్యోగ ఖాళీల భర్తీకై ముఖ్యమంత్రితో చర్చించి నోటిఫికేషన్ తీసుకురాని పక్షంలో రాజీనామా చేస్తారా..? అని నిరుద్యోగులు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఒప్పుకోని పక్షంలో ఎప్పుడు రాజీనామా చేస్తారో చెప్పాలని కోరారు. తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులను శాంతింపజేసేందుకు వాణీదేవి ప్రయత్నించారు. రాజీనామా అంశాన్ని ప్రస్తావించవద్దని సూచించారు. పట్టుదల మంచిదే కానీ.. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిరుద్యోగులు వెనక్కి తగ్గకపోవడంతో గ్రంథాలయం నుంచి వాణీదేవి వెళ్లిపోయారు.

సీఎం దృష్టికి తీసుకెళ్తా..

"ఐదేళ్ల క్రితం విషయం నాకు తెలియదు. ప్రస్తుతం జరుగుతున్న విషయం కోసం మాట్లాడతాను. నా కెరియర్​ను ఉపాధ్యాయురాలిగా ప్రారంభించాను. మీ సమస్య నాకు అర్థమైంది. హైదరాబాద్​లోనే ఉంటాను. అసెంబ్లీ ఇంకా కొనసాగుతోంది. అక్కడ ప్రస్తావిస్తాను. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి.. సమస్య పరిష్కారానికి నా శాయశక్తులా కృషి చేస్తాను. అలవి కానీ హామీలు నేనివ్వలేను."-వాణీదేవి, ఎమ్మెల్సీ

అసెంబ్లీ ముట్టకి సిద్ధం..

"నాడు వేటీ కోసం పోరాడామో ఆ విషయాలను పక్కన పెట్టి నిరుద్యోగుల జీవితాలతో ఈ ప్రభుత్వం చెలగాటమాడుతోంది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాగ్దానాన్ని ఎమ్మెల్సీ వాణీదేవి విస్మరించారు. నిరుద్యోగుల ఆవేదనను ఏమాత్రం గుర్తించడం లేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలపై ఆశలు చూపి.. అన్ని ఎన్నికలు పూర్తి చేసుకొని చివరకు నిరుద్యోగులకు నిరాశే మిగిలింది. ఏడేళ్లలో ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయకుండా.. నిరుద్యోగుల జీవితాలను సర్వనాశనం చేశారు. కిరణ్​కుమార్​ రెడ్డి హయాంలో వేసిన గ్రూప్​-1 నోటిఫికేషన్​ తర్వాత ఇప్పటివరకు మళ్లీ వేయకపోవటం.. సిగ్గుచేటు. 2014లో గ్రూప్​-2 నోటిఫికేషన్​ వేస్తే.. ఇప్పటికీ మళ్లీ వేయకపోవటం దారుణం. నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తూ.. ఇప్పటివరకు ఎందరో యువత జీవితాలు నాశనమయ్యాయి. ఇప్పటికైనా.. ఉద్యోగాల భర్తీ విషయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు చర్చించి న్యాయం చేయాలి. లేనిపక్షంలో అసెంబ్లీని ముట్టడించేందుకు మేం సిద్ధం." - నిరుద్యోగ యువత

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details