ఏపీలోని విజయవాడ వన్‌టౌన్ కొత్తపేట ఎస్‌కేపీవీ హిందూ హై స్కూల్ ముందు జనసేన పార్టీతో పాటు వివిధ విద్యార్థి సంఘాలు కలిసి చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. ఎయిడెడ్ స్కూళ్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళన చేపడుతున్న క్రమంలో.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. దీంతో పోలీసుల వాహనాలపై విద్యార్థులు దాడికి యత్నించారు. అదుపులో తీసుకున్న వారిని వదిలివేయటంతో పరిస్థితి సద్దుమణిగింది.
protest: ఎయిడెడ్ స్కూళ్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా.. పరిస్థితి ఉద్రిక్తం - జనసేన
ఎయిడెడ్ స్కూళ్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీలోని విజయవాడలో విద్యార్థులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతంగా మారింది. ఈ క్రమంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడంతో విద్యార్థులు పోలీసుల వాహనాలపై దాడికి యత్నించారు.
ఎయిడెడ్ స్కూళ్ల రద్దు నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోకుంటే విద్యార్థులతో కలిసి సీఎం క్యాంప్ ఆఫీస్‌ను ముట్టడిస్తామని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేశ్ హెచ్చరించారు. విజయవాడ వన్‌టౌన్ పరిధిలో సుమారు 10వేల మంది పిల్లలు ఎయిడెడ్ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారని.. వారందరి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశాలున్నాయన్నారు. నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:NEET Student Suicide: డాక్టర్ కావాల్సిన యువతి.. ఫ్యాన్‌కు ఉరేసుకుని...