తెలంగాణ

telangana

ETV Bharat / city

stephen ravindra: సైబరాబాద్ సీపీగా స్టీఫెన్ రవీంద్ర బాధ్యతల స్వీకరణ

సైబరాబాద్ సీపీగా స్టీఫెన్​ రవీంద్ర బాధ్యతలు స్వీకరించారు. సైబరాబాద్​ కమిషనరేట్​లో సీపీ సజ్జనార్ ఆయనతో బాధ్యతల స్వీకరణ పత్రంపై సంతకం చేయించారు.

stephen ravindra
stephen ravindra

By

Published : Aug 25, 2021, 8:33 PM IST

Updated : Aug 25, 2021, 9:46 PM IST

సైబరాబాద్ సీపీగా స్టీఫెన్​ రవీంద్ర బాధ్యతలు స్వీకరించారు. తనపై నమ్మకం ఉంచి సైబరాబాద్ సీపీగా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్​కి స్టీఫెన్ రవీంద్ర కృతజ్ఞతలు తెలిపారు. గచ్చిబౌలి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్​లో వీసీ.సజ్జనార్ ఆధ్వర్యంలో సైబరాబాద్ సీపీగా స్టీఫెన్ రవీంద్ర బాధ్యతలు చేపట్టారు.

సైబరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన స్టీఫెన్ రవీంద్ర

తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని, సైబరాబాద్ ఐటీ కారిడార్ భద్రత.. సైబర్ క్రైమ్స్, రోడ్ సేఫ్టీపై దృష్టి సారిస్తానని చెప్పారు. రాష్ట్రంలోనే సైబరాబాద్ పోలీసు కమిషనరేట్​కు మంచి గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు. ఇప్పటి వరకు సైబరాబాద్ ప్రజానీకానికి సేవ చేసే అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి వీసీ సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్​లో తనకు సహకరించిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర

1990 బ్యాచ్ అధికారి..

ప్రస్తుతం రాష్ట్రంలోని పశ్చిమ మండల ఐజీగా విధులు నిర్వహిస్తున్న స్టీఫెన్ రవీంద్ర గతంలో హైదరాబాద్​లో డీసీపీగాను పనిచేశారు. 1990 బ్యాచ్‌కు చెందిన రవీంద్ర.. సర్దార్ వల్లభాయ్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్​గా పని చేశారు. రాయలసీమలో ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలతో పాటు మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో సమర్థవంతంగా పని చేసిన అధికారిగా గుర్తింపు ఉంది.

సైబరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరిస్తున్న స్టీఫెన్ రవీంద్ర

రాష్ట్ర విభజన తర్వాత స్టీఫెన్ రవీంద్రను తెలంగాణకు కేటాయించారు. గత ఏడాది రాష్ట్రంలో సంచలనం రేపిన ఐటీ గ్రిడ్ చోరీకి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌కు కూడా స్టీఫెన్ రవీంద్ర ఇంఛార్జ్‌‌గా ఉన్నారు.

సీపీ స్టీఫెన్ రవీంద్రకు పుష్పగుచ్ఛం అందిస్తున్న వీసీ సజ్జనార్

ఇవీ చూడండి:PROMOTIONS: రాష్ట్రంలో నలుగురు ఐపీఎస్‌లకు డీజీపీ హోదా

Last Updated : Aug 25, 2021, 9:46 PM IST

ABOUT THE AUTHOR

...view details