జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ముగిసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి వెల్లడించారు. డిసెంబర్ 1న జరగనున్న పోలింగ్ కోసం అన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. గడువు ముగిసిన తర్వాత ప్రచారం చేస్తే రెండేళ్లు జైలుశిక్ష, జరిమానా విధించనున్నట్టు తెలిపారు. డిసెంబర్ 1 సాయంత్రం 6 గంటలకు వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. బయటి వ్యక్తులు జీహెచ్ఎంసీ పరిధి దాటి వెళ్లాలని ఆదేశించింది. ఇప్పటి వరకు 92.04 శాతం పోలింగ్ చీటీల పంపిణీ పూర్తైనట్టు వెల్లడించారు.
ఐదు చోట్ల ముగ్గురే..
గ్రేటర్లో 150 డివిజన్లుకు గానూ... 1,122 మంది పోటీ ఉన్నారు. జంగమ్మెట్ డివిజన్లో అత్యధికంగా 20 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉప్పల్, బార్కస్, నవాబ్‌సాహెబ్‌కుంట, టోలీచౌకి, జీడిమెట్లతో కేవలం ముగ్గురు అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారు. తెరాస నుంచి 150 మంది, భాజపా నుంచి 149, కాంగ్రెస్ నుంచి 146, తెదేపా నుంచి 106, ఎంఐఎం నుంచి 51, సీపీఐ నుంచి 17, సీపీఎం 12, 415 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. జీహెచ్‌ఎంసీలో మొత్తం 74 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా... మైలార్‌దేవ్‌పల్లి డివిజన్లో అత్యధికంగా, రామచంద్రాపురంలో అత్యల్ప ఓటర్లు ఉన్నారు.