కాసేపట్లో మంత్రివర్గం భేటీ.. లాక్డౌన్పై కీలక నిర్ణయం - సీఎం కేసీఆర్
తెలంగాణ మంత్రిమండలి సమావేశం మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో భేటీ జరగనుంది.
కాసేపట్లో మంత్రివర్గం భేటీ.. లాక్డౌన్పై కీలక నిర్ణయం
హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సీఎం అధ్యక్షతన కొద్దిసేపట్లో మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. లాక్‌డౌన్ ఆంక్షల సడలింపుపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఈ నెల 20 నుంచి కొన్ని మినహాయింపులు ఇవ్వాలని కేంద్రం సూచించింది. ఈక్రమంలో రాష్ట్ర ప్రభుత్వపరంగా ప్రత్యేక నిబంధనలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితోపాటు ఏప్రిల్ నెల వేతనాలపైనా మంత్రివర్గ భేటీలో చర్చించనున్నట్టు తెలుస్తోంది.