శ్రీశైలం జలాశయం నుంచి రెండోరోజు ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. స్పిల్ వే ద్వారా 1,36,475 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. 4,30,566 క్యూసెక్కుల నీరు జలాశయానికి వచ్చి చేరుతోంది.
శ్రీశైలం జలాశయం 5 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా... శ్రీశైలం ప్రాజెక్టుకు అధికంగా నీరు వస్తోంది. ఫలితంగా ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. వరద ఉద్ధృతి కొనసాగుతుండడంతో జలాశయం గేట్లు ఎత్తి సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయం 5 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
జలాశయం ప్రస్తుత నీటిమట్టం 883.30 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటినిల్వ 206.0996 టీఎంసీలు ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో జరుగుతోంది. 70,948 క్యూసెక్కులు సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
ఇదీ చదవండి:ఈ నెలాఖరు వరకు టీవీ పాఠాలు లేనట్లే.. పచ్చజెండా ఊపని ప్రభుత్వం