తెలంగాణ

telangana

ETV Bharat / city

PM in Tirumala: తిరుమలకు శ్రీలంక ప్రధాని.. అధికారుల ఘనస్వాగతం - శ్రీలంక ప్రధాని

SriLanka PM Tirumala Visit : తిరుమల శ్రీవారి దర్శనం కోసం కొలంబో నుంచి శ్రీలంక ప్రధాని రాజ పక్సే, ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యేక విమానంలో రేణిగుంటకు తరలివచ్చారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమల చేరుకున్నారు.

SriLanka PM Tirumala Visit
తిరుమలకు చేరుకున్న శ్రీలంక ప్రధాని

By

Published : Dec 23, 2021, 4:57 PM IST

SriLanka PM Tirumala Visit : తిరుమల శ్రీవారి దర్శనం కోసం కొలంబో నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు శ్రీలంక ప్రధాని రాజపక్సే. కుటుంబంతో సహా వచ్చిన ఆయనకు.. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ ఘన స్వాగతం పలికారు. భారతీయ సంప్రదాయ నృత్యాలతో స్వాగతం ఏర్పాట్లు చేశారు.

SriLanka PM Raja pakshe: అనంతరం శ్రీలంక ప్రధాని రోడ్డు మార్గాన తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి నగర్​లోని శ్రీకృష్ణ అతిథి గృహానికి రాజపక్సే చేరుకున్నారు. రాత్రికి తిరుమలలోనే బస చేయనున్న శ్రీలంక ప్రధాని.. రేపు ఉదయం స్వామివారి సేవలో పాల్గొంటారు.

ABOUT THE AUTHOR

...view details