తెలంగాణ

telangana

ETV Bharat / city

నిర్లక్ష్యానికి నిదర్శనం: పగిలిన పైప్​లైన్.. వృథాగా తాగునీరు - పైప్​లైన్ లీకేజీ

ఏపీలోని అనంతపురం జిల్లా మడకశిరలో శ్రీ రామిరెడ్డి తాగునీటి పైప్​లైన్ పగలి నీరు వృథాగా పోయింది. సంబంధిత అధికారుల మరమ్మతులు చేశారు.

శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం పైప్​లైన్ పగిలి నీటి వృథా
శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం పైప్​లైన్ పగిలి నీటి వృథా

By

Published : Oct 8, 2020, 10:29 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా తాగునీటి సమస్య తీర్చేందుకు గత ప్రభుత్వాలు పీఏబీఆర్ డ్యాం నుంచి శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం ద్వారా ప్రజలకు త్రాగునీరు అందించాయి. నిర్వహణలో జాప్యం కారణంగా పలుచోట్ల పైపులైను పగిలి నీటితోపాటు ప్రజాధనం వృథా అవుతోంది. బుధవారం సాయంత్రం మడకశిర పట్టణంలోని యాదవ కళ్యాణ మండపం సమీపం వద్ద శ్రీ రామిరెడ్డి తాగునీటి పైప్​లైన్ పగిలి నీరు ఉవ్వెత్తున ఎగిసి పడింది.

నీటి ప్రవాహానికి ఆ ప్రాంతం చెరువును తలపించింది. ఎట్టకేలకు సంబంధిత అధికారులకు విషయం తెలిసి ప్రస్తుతం మరమ్మతులు చేశారు. ఇప్పటికైనా అధికారులు ప్రజల దాహార్తిని తీర్చే శ్రీ రామిరెడ్డి తాగునీటి పైప్​లైన్ సంరక్షణలో అలసత్వం వహించక నీరు అందించాలని ప్రజలు కోరుతున్నారు.

శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం పైప్​లైన్ పగిలి నీటి వృథా

ఇదీ చదవండి:తెలుగు రాష్ట్రాల జలవివాదం: క్రియాశీలకం కానున్న కృష్ణాబోర్డు

ABOUT THE AUTHOR

...view details