తెలంగాణ

telangana

ETV Bharat / city

హరేకృష్ణ మూవ్​మెంట్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు - sri krishna janmashtami celebrations

హరేకృష్ణ మూవ్​మెంట్​-హైదరాబాద్​ ఆధ్వర్యంలో తొలిరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొవిడ్​ వ్యాప్తి దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించారు.

srikrishna janmastami
హరేకృష్ణ మూవ్​మెంట్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

By

Published : Aug 11, 2020, 10:49 PM IST

హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని హరేకృష్ణ స్వర్ణదేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హరేకృష్ణ మూవ్​మెంట్​-హైదరాబాద్ ఆధ్వర్యం ఈ కార్యక్రమం జరిగింది. తొలుత వేద మంత్రాల నడుమ మహా అభిషేకం నిర్వహించారు. అనంతరం హరినామ సంకీర్తనలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. కొవిడ్​ పరిస్థితుల దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించారు. ఈ మహాత్సవాన్ని దేవాలయం యూట్యాబ్​ ఛానల్​ ద్వారా చూడాలని భక్తులకు సూచించారు.

హరేకృష్ణ మూవ్​మెంట్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

ABOUT THE AUTHOR

...view details