తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రత్యేక రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

అన్‌లాక్‌లో భాగంగా నడుపుతున్న ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. తక్కువ ఆక్యుపెన్సీ ఉండడం వల్ల పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ద.మ రైల్వై వెల్లడించింది.

south central railway stop some special trains between delhi and secunderabad
ప్రత్యేక రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

By

Published : Sep 9, 2020, 7:50 AM IST

అన్‌లాక్‌లో భాగంగా భారతీయ రైల్వే ఎంపిక చేసిన ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అయితే 25శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ ఉండడం వల్ల పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈనెల 13 నుంచి న్యూ ఢిల్లీ -సికింద్రాబాద్ మధ్య నడిచే రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను, 16 నుంచి సికింద్రాబాద్-న్యూ ఢిల్లీ మధ్య నడిచే రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను రైళ్లను రద్దు చేసినట్లు ఎస్‌సీఆర్‌ ప్రకటించింది.

ABOUT THE AUTHOR

...view details