తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆదాయంలో కీలక మైలురాయిని దాటిన దక్షిణ మధ్య రైల్వే

దక్షిణ మధ్య రైల్వే ఆదాయంలో రికార్టు నమోదు చేసింది. రూ.10వేల కోట్ల మైలు రాయిని దాటింది. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌-డిసెంబరు నాటికే రూ.10,270 కోట్లు అర్జించింది.

secundrabad
secundrabad

By

Published : Jan 27, 2020, 3:07 PM IST

దక్షిణ మధ్య రైల్వే ఆదాయం రూ.10 వేల కోట్ల మైలురాయిని దాటింది. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌-డిసెంబరు నాటికే రూ.10,270 కోట్లు అర్జించింది. 28.4 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చింది. 8.10 కోట్ల టన్నుల సరకులను రవాణా చేసింది.

రైల్వే ట్రాక్‌ నిర్మాణంలో 119 కి.మీ. డబ్లింగ్‌, 14 కి.మీ. కొత్త రైలు మార్గాల్ని పూర్తి చేసింది. మిషన్‌ ఎలక్ట్రిఫికేషన్‌ పేరుతో 155 కి.మీ. మేర విద్యుదీకరించింది. డిజిటల్‌ టెక్నాలజీలో భాగంగా కాగిత రహితం చేసి ఈ-ఆఫీస్​ను వినియోగిస్తున్న దేశంలో తొలి జోన్‌గా ఇటీవల గుర్తింపు పొందింది.

ఇదీ చూడండి: పురపాలికలను దక్కించుకునేందుకు తెరాస వ్యూహాలు

ABOUT THE AUTHOR

...view details