తెలంగాణ

telangana

ETV Bharat / city

కన్నతండ్రిపై కుమారుడి కర్కశత్వం.. ఆస్తి కోసం విచక్షణారహిత దాడి.. - తండ్రిపై కుమారుడి దాడి

కన్నతండ్రిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడో కుమారుడు. ఆస్తి విషయమై తలెత్తిన వివాదంతో మృగంలా మారి పాశవికంగా దాడి చేశాడు. ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

attack on father
attack on father

By

Published : Feb 19, 2022, 4:48 PM IST

కన్నతండ్రిపై కుమారుడి కర్కశత్వం.. ఆస్తి కోసం విచక్షణారహిత దాడి..

ఆస్తి కోసం కన్నకండ్రిపైనే కర్కశత్వం చూపించాడు ఓ పుత్రరత్నం. ఆస్తి సమానంగా పంచలేదని.. భార్యతో కలిసి తండ్రిని కర్రతో ఇష్టమొచ్చినట్టు కొట్టాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

ఏపీలోని కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్దమర్రివీడుకు చెందిన చంద్రన్నకు ఇద్దరు భార్యలు. మెుదటి భార్య చనిపోవటంతో వెంకటేశ్వరమ్మను రెండో వివాహం చేసుకున్నాడు. మెుదటి భార్యకు ఓ కుమారుడు, కూతురు ఉండగా.. రెండో భార్యకు ఇద్దరు కుమారులు. చంద్రన్న అందరికీ వివాహం చేసి.. ఆస్తిని సమానంగా పంచాడు.

కాగా.. ఆస్తి పంపకాల్లో తేడాలు వచ్చాయని మెుదటి భార్య కుమారుడు మల్లేశ్​.. కొంత కాలంగా చంద్రన్నతో గొడవ పడుతున్నాడు. ఇదే విషయంలో భార్య గాయత్రితో కలిసి చంద్రన్నపై కర్రతో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఘటనపై రెండో భార్య వెంకటేశ్వరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాడికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details