Somu Veerraju On Liquor Prices:ఏపీలోఅధికారంలోకి వస్తే లిక్కర్‌ను రూ. 70కే విక్రయిస్తామంటూ చేసిన వ్యాఖ్యలను భాజపా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సమర్థించుకున్నారు. పేదవాడిని దృష్టిలో పెట్టుకునే తాను ఈ వ్యాఖ్యలు చేశానన్నారు. రూ.6 బాటిల్‌ను రూ.250లకు అమ్మడాన్ని భాజపా ప్రోత్సహించదని వ్యాఖ్యానించారు. పేదల కోసం చీప్ లిక్కర్‌ను రూ. 50కే అమ్మాలని డిమాండ్ చేశారు. రూ.50కి చీప్ లిక్కర్ అమ్మితే కుటుంబానికి ఏడాదికి రూ.2 లక్షలకు పైగా మిగులుతాయన్నారు. తనను సారాయి వీర్రాజు అన్నవారు ఏం తాగుతారో తనకు తెలుసునని ఎద్దేవా చేశారు.
గుంటూరు జిన్నా టవర్ పేరు మార్చాల్సిందేనని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఏపీలో భాజపా అధికారంలోకి వచ్చాక.. జిన్నా టవర్ పేరు మారుస్తామన్నారు. విశాఖ కింగ్ జార్జ్ ఆస్పత్రి పేరునూ మార్చాలన్నారు.
రూ.6 మద్యం బాటిల్.. 250 రూపాయలకు అమ్ముతారా?. రోజుకు రెండు బాటిళ్లు తాగితే.. ఏడాదికి 2 లక్షల రూపాయలకు పైగా ఖర్చవుతుంది. ఈ లెక్క ముందు జగన్ ఇచ్చే కానుకలెంత. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు కోసం మహిళలంతా ఉద్యమం చేయాలి. విద్యార్థులకు కుళ్లిపోయిన కోడిగుడ్లు పెడుతున్నారు. భాజపా అధికారంలోకి వచ్చాక.. ప్రతి నియోజకవర్గంలో నిరుద్యోగుల చేత నాటు కోళ్ల ఫారాలు పెట్టిస్తాం. గుంటూరులో జిన్నా టవర్‌ను తొలగించాలి. దవళేశ్వరం బ్యారేజీకి... కాటన్ మాదిరిగా ఇంజినీర్ వీణం వీరన్న పేరు పెట్టాలి. వీరన్న పేరునూ హైలెట్ చెయ్యాలి. విశాఖలో కింగ్ జార్జి హాస్పిటల్ (కేజీహెచ్)కు తెన్నేటి విశ్వనాథం, గౌతు లచ్చన్న పేరు పెట్టాలి. మీరు పేర్లు మార్చకపోతే.. భాజపా అధికారంలోకి వచ్చాక పెడతాం.