రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం సరూర్‌నగర్ డివిజన్ పరిధిలో బస్తీ వాసుల సమస్యలను తక్షణమే పరిష్కారించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. సరూర్‌నగర్ చౌడీ, కుమ్మరిబస్తీ, ఎరుకుల బస్తీ, వెంకటేశ్వర హిల్స్ కాలనీ, ఇంద్రహిల్స్ కాలనీలో మంత్రి సబితా పర్యటించారు. అనంతరం ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
బస్తీవాసుల సమస్యలను వెంటనే పరిష్కరించండి : మంత్రి సబితా ఎంపీతో కలిసి ప్రారంభోత్సవం..
ఆర్కే పురం డివిజన్ కృష్ణానగర్ కాలనీ కమ్యూనిటీ హాల్ వద్ద సీసీ కెమెరాలను ఎంపీ రంజిత్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. విజన్‌తో హైదరాబాద్ మహానగర అభివృద్ధికి శ్రీకారం చుట్టామని ఆమె పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందని మంత్రి పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి, కాలనీ వాసులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
బస్తీవాసుల సమస్యలను వెంటనే పరిష్కరించండి : మంత్రి సబితా ఇవీ చూడండి : కూర బాగా వండలేదని తల్లి గొంతు కోసిన కొడుకు