వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం రాత్రి ఏడు గంటల వరకు 37 స్లాట్లు తీసుకొన్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రారంభించిన స్లాట్ల బుకింగ్... 15 నిమిషాల్లోపే రెండు స్లాట్లు బుక్ అయినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 17,567 మంది వెబ్సైట్ను చూడగా... 3987 మంది రిజిస్టర్ చేసుకున్నారని, 4143 లావాదేవీలు ప్రారంభమయ్యాయని సీఎస్ వివరించారు.
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం భారీగా స్లాట్ బుకింగ్లు - ధరణి రిజిస్ట్రేషన్లు
ఎట్టకేలకు ప్రారంభమైన వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం భారీగా స్లాట్లు బుక్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 17,567 మంది వెబ్సైట్ను చూడగా... 3987 మంది రిజిస్టర్ చేసుకున్నారని, 4143 లావాదేవీలు ప్రారంభమయ్యాయని సీఎస్ వివరించారు. ఒక్క రోజే 37 స్లాట్లు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
స్లాట్ల బుకింగ్ ద్వారా ఇప్పటి వరకు రూ.85 లక్షల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఎక్కణ్నుంచైనా స్లాట్లు బుక్ చేసుకోవచ్చన్న సోమేశ్ కుమార్... రూ.200 చెల్లించి మీసేవ కేంద్రాల ద్వారా కూడా స్లాట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. పోర్టల్ ద్వారా సులువుగా డాక్యుమెంట్ కూడా తయారు చేసుకునే అవకాశం ఉందని అన్నారు. బిల్డర్లు, డెవలపర్ల కోసం ప్రత్యేక విండో ఏర్పాటు చేసినట్లు సీఎస్ వివరించారు. ఇప్పటి వరకు 451 మంది బిల్డర్లు 93వేలకు పైగా కొత్త ఆస్తులను అప్లోడ్ చేశారని చెప్పారు. ఇప్పటి వరకు స్థానిక సంస్థలు 12,699 టీ- పిన్స్ సంఖ్యను ఇచ్చాయని... వాటి లావాదేవీలు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని సీఎస్ తెలిపారు.